Breaking News

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, వ్యాపార నిర్వహణ శక్తి సామర్థ్యం పై ఆగస్టు 6వ తేదీ నుంచి ఉచిత శిక్షణ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి జిల్లా లోని ,మహిళా ప్రాంగణం, తిరుపతి నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 6వ తేదీ నుంచి ఎనిమిది రోజులు పాటు, (8), జనరేట్ యువర్ బిజినెస్ (GYB) & స్టార్ట్ యువర్ బిజినెస్ పై (SYB ) ఉచిత శిక్షణ నిర్వహించనున్నామని, జిల్లా నైపుణ్యభివృద్ది సంస్థ అధికారి, ఆర్. లోకనాధం తెలిపారు. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషణ్ సంయుక్తంగా జరిపే ఈ శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేయాలని కోరారు. వ్యాపార నిర్వహణ శక్తి సామర్ధ్యాలు, ఔత్సాహిక పారిశ్రామికవేతగా ఎదగడానికి కావలసినటువంటి మెలకువలు, వ్యాపారం చేసుకొనుటకు కావలసినటువంటి విధి విధానాలు అనే అంశంపై శిక్షణ, వ్యాపార అభివృద్ధిలో మార్కెటింగ్, కొనుగోలు, స్టాక్ నియంత్రణ, ఖాతా పుస్తకాలు నిర్వహణ, వ్యాపార ప్రణాళిక, ఉత్పాదక అంశాలపై అవగాహన క ల్పిస్తామని చెప్పారు. శిక్షణలో పాల్గొన్న వారికి సర్టిఫికెట్ ఇస్తామన్నారు.

కనీస వయస్సు: 18 నుండి 40 సంవత్సరాల వయసు కలవారు

విద్యార్హత: ఎనిమిదో తరగతి పాస్ ఆర్ ఫెయిల్

యువతి యువకులు ఏదైనా వ్యాపారం ప్రారంభించాలానే, ఆసక్తి, ఆలోచన కలిగిన వారు అర్హులు అని చెప్పారు.

ఇతర వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు: 9966601867, కోఆర్డినేటర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, తిరుపతి.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *