Breaking News

ఆగస్ట్, 20 న డీ వార్మింగ్ డే .. ప్రభుత్వ, ప్రవేట్ స్కూల్ విద్యార్థులకు పంపిణి

-మీకు తెలుసా..? …. హెచ్ ఐ వి పై ఆగష్టు 12 నుంచి 8 వారాల ప్రచార కార్యక్రమం
-2030 నాటికి జిల్లా నుంచి అంటువ్యాధులను నిర్మూలిద్దాం
-ప్రత్యేక అధికారుల వ్యక్తిగత పర్యవేక్షణా చెయ్యాలి
-జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆగష్టు 12 నుంచి అక్టోబర్ 13 వరకూ ఎనిమిది వారాల పాటు హెచ్ ఐ వి పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అంతర్జాతీయ యువజన దినోత్సవం ఆగష్టు 12 నుంచి ప్రచారం చేపట్టడం జరిగిందని, ఆగష్టు, 20 న డీ వార్మింగ్ డే ను పురస్కరించుకుని ప్రభుత్వ, ప్రవేటు స్కూల్స్ లో చదివే ప్రతి ఒక్కరికి ” అల్బెండెజాలె ” మాత్రలు మధ్యాహ్నం భోజన సమయంలో వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు.

సోమవారం కలెక్టరేట్ గ్రివియన్స్ సమావేశ మందిరంలో డీ వార్మింగ్ డే , మీకు తెలుసా..? ప్రచారాన్ని కలెక్టర్ పి ప్రశాంతి, ఇన్చార్జి జెసి జి నరసింహులు, ఇతర వైద్య ఆరోగ్య అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, హెచ్ ఐ వి పై , డీ వార్మింగ్ పై ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా ప్రత్యేక అధికారుల వ్యక్తిగత శ్రద్ద తీసుకొని, ప్రచార కార్యక్రమాలలో విస్తృత స్థాయిలో పాల్గొనాలని ఆదేశించారు. ఆగస్ట్, 20 న డీ వార్మింగ్ డే .. సందర్బంగా ప్రభుత్వ,  ప్రవేట్ స్కూల్ విద్యార్థులకు ” అల్బెండెజాలె ” మాత్రలు పంపిణి చేసి పిల్లల మధ్యాహ్నం భోజన సమయంలో వేసుకునేలా చూడాలన్నారు.  ఆంత్రాహెల్మింటిక్ మందు, ఇది పరాన్నజీవుల వల్ల కలిగే అనేక విధాల సంక్రమణ అంటువ్యాధుల చికిత్సలో ఉపయోగించబడుతుంది. ఇది అల్బెండజోల్ అనే యాంత్రిక్ మందును కలిగి ఉంటుందన్నారు. ఒకటీ నుంచి రెండు సంవత్సరాల పిల్లలకు” అల్బెండెజాలె 200 ఎంజీ ” మాత్ర, 2 పైబఫీ 19 ఏళ్ల లోపు పిల్లలకు ” అల్బెండెజాలె 400 ఎంజీ” మాత్ర ఒక డోసు చొప్పున ఇవ్వాలన్నారు. ప్రభుత్వ స్కూల్స్ తో పాటు అన్ని ప్రవేటు స్కూలు విద్యార్థులు తప్పకుండా ” అల్బెండెజాలె ” మాత్రలు వేసుకునేలా చూడాలన్నారు. ఇందుకోసం ప్రత్యేంగా పర్యవేక్షణ బాధ్యతలు ప్రత్యేక అధికారులదే అని స్పష్టం చేశారు. ఆగష్టు 28 వ తేదీ మరోసారి మిగిలిన పిల్లలకి అందించే క్రమంలో ఇంటింటి ప్రచారం చేసి అందచెయ్యాల్సి ఉందన్నారు. జిల్లా వ్యాప్తంగా 1 నుంచి 19 ఏళ్ల వయస్సు కలిగిన 4,30,339 మందికి మాత్రలు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఏదైనా ప్రవేటు స్కూలు విద్యార్థులకి ఆ మాత్రలు వేసుకునేందుకు సహకారం అందించనీ పక్షంలో వాటిపై చర్యలకి సిద్దం కావాలన్నారు.. ప్రజా ఆరోగ్యం పట్ల బాధ్యత కలిగి ఉండాలన్నారు.. ఇందుకు ప్రభుత్వ, ప్రవేటు అనే వత్యస్యం లేదని పేర్కొన్నారు.

హెచ్ ఐ వి ప్రభావం తక్కువగా ఉన్నప్పటికి కేసుల నమోదు విషయంలో తూర్పు గోదావరి జిల్లాలో కేసుల నమోదు సంఖ్య ఎక్కువగా ఉండడం దృష్ట్యా అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు, చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. 2030 నాటికి భారత దేశం నుంచి హెచ్ ఐ వి/ ఎయిడ్స్ ఇతర అంటూ వ్యాధుల మహమ్మారిని అంతం చేయాలనే లక్ష్యంతో సమగ్ర అభివృద్ది లక్ష్యాలు సాధన కోసం కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. గతంలో హెచ్ ఐ వి పై ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమాలు చేపట్టడం ద్వారా జాగృతి చెయ్యడం జరిగిందని పేర్కొన్నారు. అదే విధంగా మరోసారి జిల్లాలో అవగాహన కల్పించడం కోసం ప్రత్యేక కార్యచరణ తో సిద్దం కావాలని పిలుపు నిచ్చారు. ప్రసార కార్యక్రమాలు, నివారణ చర్యలు, అనుమానాలు, అపోహలు తొలగించడం, రిస్క్ పై అవగాహన, హెచ్ ఐ వి బాధితులకు అందిస్తున్న సేవలు పై ప్రచారం, 1097 హెచ్ ఐ వి హెల్ప్ లైన్,  సురక్షిత మార్గాలు, నివారణ చికిత్స, మాదక ద్రవ్యాలు వాడకం నివారణ, కలంకం, వివక్ష్ నివారణ కోసం ప్రజల్లోకి సమర్ధవంతంగా అవగాహన కల్పించడం కోసం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ జి నరసింహులు డిఎంహెచ్వో కే వెంకటేశ్వర రావు, జిల్లా లేప్రసి, టీబీ అధికారి ఎన్. వసుంధర, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *