Breaking News

రాష్ట్రాభివృద్ధి చరిత్రను సువర్ణాక్షరాలతో లిఖిస్తాం

-అభివృద్ధి, సంపద సృష్టి లక్ష్యంగా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోంది
-పర్యాటకం, రైల్వే, మైనింగ్ రంగాల్లో రాష్ట్రానికి కేంద్ర సహకారం కోరాం
-ఢిల్లీలో నిర్వహించిన మైనింగ్ అధికారుల సమావేశంలో సానుకూలంగా జరిగింది
-రాష్ట్రాభివృద్ధికి ఉండే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటాం
-రాష్ట్రాభివృద్ధికి ఢిల్లీ పర్యటన కీలకం కానుందని తెలిపిన మంత్రి కొల్లు రవీంద్ర

న్యూ ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకోవడానికి ఉండే ప్రతి అవకాశాన్ని కూడా ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఢిల్లీలో కేంద్ర గనులు, బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు. అనంతరం కేంద్ర అధికారుల్ని కలిసి రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన ప్రతిపాదనలను అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..

రాష్ట్రంలో అపారమైన సంపద ఉంది. దాదాపు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. రాష్ట్రంలో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించే అవకాశం ఉన్నప్పటికీ, జగన్ రెడ్డి వినియోగించుకోలేదు. పైగా దోపిడీ కోసం రాష్ట్రంలోని వనరుల్ని వాడుకున్నాడు. అందుకే కేంద్ర ప్రభుత్వం నేషనల్ మైన్స్ ఇన్వెస్టిగేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసిందన్నారు. 2019-24 మధ్య కాలంలో జగన్ రెడ్డి చేసిన అరాచకాలు, దోపిడీ కారణంగా రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో నడిచింది. ఒక్క ఇసుకలోనే దాదాపు లక్షల కోట్లు దిగమింగారు. బీచ్ శాండ్‌లో అద్బుతమైన మినరల్స్ ఉన్నాయి. వాటిని దేశం కోసం, రాష్ట్రం కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. వ్యవస్థల్ని ప్రక్షాళన చేసేలా చర్యలకు శ్రీకారం చుడుతున్నాం.

రాష్ట్రాభివృద్ధిని సువర్ణాక్షరాలతో లిఖిస్తాం
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. జగన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాం. పోలవరం, అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకారం తెలిపింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఇకపై రాష్ట్రంలో అన్నీ శుభ సూచకాలేనని, రాష్ట్రాభివృద్ధిని సువర్ణాక్షరాలతో చరిత్ర రాయబోతున్నామన్నారు.

పర్యాటకాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధికి ఉన్న అవకాశాలను కేంద్ర టూరిజం సెక్రటరీకి వివరించాం. మచిలీపట్నం నియోజకవర్గంలో మంగినపూడి బీచ్, బ్యాక్ వాటర్స్ పర్యాటకాభివృద్ధికి ఎంతో తోడ్పడతాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీచ్ రిసార్ట్స్ నిర్మాణానికి మెరుగైన అవకాశాలున్నాయి. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయి నివేదికతో త్వరలో వచ్చి కలుస్తాం.

విజయవాడకు రైల్వే కనెక్టివిటీ ఉంది. మచిలీపట్నం – రేపల్లె లైన్ వేయగలిగితే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందని రైల్వే శాఖ అధికారుల్ని కోరామన్నారు. కలకత్తా – చెన్నై రోడ్డును మచిలీపట్నం మీదుగా బీచ్ కారిడార్ ఏర్పాటు చేయగలిగితే రవాణా వ్యవస్థ పటిష్టమవుతుంది. అదే సమయంలో రైలు, రోడ్డు మార్గం పూర్తైతే అవనిగడ్డ, రేపల్లె, పెడన, మచిలీపట్నం నియోజకవర్గాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. బందరు పోర్టు పూర్తైతే కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు కాబోతోందని తద్వారా ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *