Breaking News

12 అంశాల ప్రాతిపదికన అభివృద్ది సామర్ధ్య ప్రణాళిక

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భంగా సిపివో/ జాయింట్ డైరెక్టర్ ఎల్. అప్పలకొండ మాట్లాడుతూ, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 దిశగా 2024-29 జిల్లా కార్యాచరణ ప్రణాళిక మేరకు 12 అంశాల ప్రాతిపదికన అభివృద్ది సామర్ధ్య ప్రణాళికలను సిద్ధం చేసుకుని అమలు దిశగా కార్యాచరణ రూపొందించాలని కోరారు. రాష్ట్ర స్థాయి లో జరిగిన వర్క్ షాప్ లో ఆమేరకు రాష్ట్ర స్థాయి లో అమలు చెయ్యాలి వాటిపై అవగాహన కల్పించటం జరిగిందన్నారు. అదే విధంగా జిల్లా స్థాయిలో కూడా ఆయా శాఖలు నివేదిక అందచేయాలని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవా రంగం వారీగా 9 విభాగాల అధ్వర్యంలో జిల్లాలో కమిటి వెయ్యడం జరిగిందన్నారు. జిల్లా పరిశ్రమల కార్యాలయ పరిశ్రమల ప్రోత్సాహక అధికారి టీవీ సూర్య ప్రకాష్ మాట్లాడుతూ, జిల్లా స్థాయి ప్రణాళిక రూపొందించడం దృష్టి కోణం తయారీపై జిల్లా స్థాయి లో అనుబంధ శాఖల అధికారులు , సంబంధిత మున్సిపాలిటీ/మండల స్థాయి ఫీల్డ్‌తో మున్సిపాలిటీ/మండల స్థాయి సమావేశాలను 2024 ఆగస్టు 26 నుండి 31వ తేదీ మధ్య నిర్వహించాల్సి ఉందన్నారు.జిల్లా కలెక్టర్ అధర్వ్యంలో సమావేశాలను నిర్వహించడమే కాకుండా ఈ విషయంలో సంబంధిత జిల్లా అధికారులచే జిల్లా దృక్పథ ప్రణాళికను రూపొందించడానికి మొత్తం పర్యవేక్షణ అధికారి వ్యవహరించడం జరుగుతుంది అని తెలిపారు. జిల్లా ఏపి-ఎమ్ఐపి అధికారి ఏ . దుర్గేష్ మాట్లాడుతూ, 2024 సెప్టెంబరు 10 నుండి 14 వరకు జిల్లాలో వ్యాసరచన, వక్తృత్వ విభాగాలపై హైస్కూల్ స్థాయిలో 6 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విజన్ ప్లాన్‌పై పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారికి సూచించారు. సంబంధిత జిల్లా అధికారులు, అన్ని MPDOలు మరియు జిల్లాలోని అన్ని మున్సిపల్ కమిషనర్లు ప్రజలకు అవగాహన కల్పించేందుకు మున్సిపల్/మండలం/GP/గ్రామ స్థాయిలో వీక్షిత్ ఆంధ్ర విజన్‌ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలని మాస్టర్ ట్రైనర్ లో తెలిపారు. ఆమేరకు అవగాహన కల్పించాలని, అలాగే మున్సిపల్ స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. 1 సెప్టెంబర్ 2024 నుండి 15వ తేదీ వరకు ప్రజలకు మండల స్థాయిలో , గ్రామ పంచాయతీ స్థాయి సమావేశాలు నిర్వహించాలన్నారు. లీడ్ బ్యాంకు మేనేజర్, ఇండస్ట్రియల్ ఛాంబర్ అసోసియేషన్‌లు, వ్యవసాయం మరియు ఆక్వా రెండింటి కోసం రైతుల సంఘం వంటి ఇతరుల నుండి పథకాల అమలు తీరు, సూచనలు సలహాలు పై వారి అభిప్రాయాలను సేకరించాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో కే ఆర్ సి సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణ నాయక్, జిల్లా పరిశ్రమల అధికారి పీకే పీ ప్రసాద్, డి ఆర్ డి ఏ పి డి ఎన్ వివి ఎస్ మూర్తి, వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఎల్ డి ఎం డివి ప్రసాద్, డిఎల్డిఓ వి శాంతామని, డ్వామా పిడి ఏ ముఖలింగం, హార్టికల్చర్ అధికారి బి సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *