Breaking News

ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాం..

-దసరా ఉత్సవాల నాటికి పవిత్ర సంగమం వద్ద నవ హారతులు సిద్ధం చేస్తున్నాం..
-జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని ముందస్తు ప్రణాళికతో అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసి దసరా ఉత్సవాల నాటికి నవ హారతులకు సిద్ధం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన తెలిపారు.

ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా, గోదావరిలకు నవ హారతులను ఇచ్చేందుకు చేపట్టాల్సిన ఏర్పాట్లను పరిశీలించేందుకు శనివారం జిల్లా కలెక్టర్‌ డా. జి. సృజన సంబంధిత శాఖాల అధికారులతో కలిసి పవిత్ర సంగమం ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పవిత్ర సంగమం వద్ద నవ హారతుల కార్యక్రమాన్ని పునరుద్దరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆలోచన అనుగుణంగా పవిత్ర సంగమం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. పవిత్ర సంగమం ప్రాంతం అభివృద్ధి చేయడానికి అన్ని శాఖల సహకారం తీసుకుంటున్నామన్నారు. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయ అధికారులు, ఇరిగేషన్‌, సీఆర్డీఏ, ఆర్‌ అండ్‌ బి, ట్రాన్స్‌ కో, పోలీస్‌ తదితర శాఖల అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులను దసరా నాటికి పూర్తి చేయనున్నట్లు ఆమె తెలిపారు. ఇబ్రహింపట్నం నుండి పవిత్ర సంగమం వరకు సుమారు 1.7 కి.లో మీటర్ల ప్రధాన రహదారిని అభివృద్ధి చేయడంతో భవిష్యత్‌లో రోడ్డు దెబ్బతినకుండా కాలవగట్లను పటిష్ట్ట పరిచేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. శానిటేషన్‌, భక్తుల భద్రత వంటి అంశాలపై ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆమె తెలిపారు. పవిత్ర సంగమం ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది రాష్ట్రంలోనే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు పవిత్ర సంగమం ప్రాంతాన్ని సందర్శించే విధంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నవ హారతుల సమయంలో భక్తుల్లో ఆధ్యాత్మిక భావం పెంపొందేలా వాఖ్యాత, భక్తి గీతాలు ఏర్పాటు చేయడం, విద్యుద్దీపాలంకరణలు చేయడం, పోలీసుల పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తు ఉండేలా ముందస్తు ప్రణాళికలతో చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ జి. సృజన తెలిపారు.

పవిత్ర సంగమం ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్‌ వెంట జాయింట్‌ కలెక్టర్‌ నిధి మీనా, ఇరిగేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కృష్ణారావు, దేవస్థానం ఎఇ ఎల్‌. రమ, కొండపల్లి మునిసిపల్‌ కమీషనర్‌ బి. రమ్యకీర్తన, సిఆర్‌డిఏ సిఇ శివప్రసాద్‌రాజు, ఏపి టూరిజం జియం పి. నాగేశ్వరరావు, ఇబ్రహీంపట్నం తహాశీల్థార్‌ వై వెంకటేశ్వర్లు, యంపిడివో రామకృష్ణ నాయక్‌, ఏపిసిపిడిసిఎల్‌ ఇఇ జి.బి.శ్రీనివాసరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ ఇ వి.కె. విజయశ్రీ, మత్స్యశాఖ జిల్లా అధికారి వి. పెద్దిబాబు, మత్స్య శాఖ ఎఫ్‌డిరఓ పి. అలేఖ్య, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *