Breaking News

పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ ఇద్దరు డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు, 4 ఉద్యోగుల సస్పెన్షన్

-ముందస్తు అనుమతి లేకుండా ఆఫీసు కాగితాలు దహనం తీవ్రంగా పరిగణించడం జరిగింది
-కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయంలో ప్రాధాన్యత లేని కాగితాలను ముందస్తూ అనుమతి లేకుండా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన దహనం చేసి అంశాన్ని విధుల్లో నిర్లక్ష్య వైఖరి గా భావించి నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు , ఇద్దరూ డిప్యూటీ తహసీల్దార్ లకి షో కాజ్ నోటీసు జారీ చెయ్యడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలియ చేశారు.

శనివారం స్థానిక ధవళేశ్వరం పోలవరం ఎడమ కాలువ భూసేకరణ కార్యాలయ (ఎల్ ఎం సి – ఎల్ ఏ) కార్యాలయ ఆఫీసు కు చెందిన కాగితాలు దహనం ఘటన ను తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రెవిన్యూ డివిజనల్ అధికారి ప్రాథమిక విచారణలో సంబంధిత పత్రాలు ప్రాధాన్యత లేనివిగా గుర్తించినప్పటికీ, విధుల విషయంలో నిర్లక్ష్యం వహించిన సంబంధిత అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఈ అంశంపై పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ నిర్వహణ, వాటినీ భద్రపరిచే అంశాల పై అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం, జాగ్రత్త వహించాల్సి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా , బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించిన సంబంధిత అధికారులు, ఉద్యోగులు పై శాఖా పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు.

ఆమేరకు పోలవరం ఎడమ కుడి కాలవ (ఎల్ ఎ) కార్యాలయనికి చెందిన కొన్ని కాగితాల దహనం చేసిన సీనియర్ అసిస్టెంట్ లు కే. నూకరాజు, కారం బేబి, స్పెషల్ రెవెన్యు ఇనస్పెక్టర్ కె. కళా జ్యోతి, ఆఫీసు సభార్డినేట్ కె. రాజశేఖర్ లను సస్పెండ్ చెయ్యడం జరిగింది. డిప్యూటీ తహసీల్దార్ లు ఏ. కుమారి, ఏ. సత్య దేవి లకి షో కాజ్ నోటీసులు జారీ చేశామన్నారు.

ఈ విషయంలో సమగ్ర శాఖా పరమైన విచారణ చేపట్టడం జరుగుతుందని కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఈ ఘటన నేపధ్యంలో ధవలేశ్వరం పోలీస్ స్టేషన్లో చేసిన డిప్యూటీ కలెక్టర్ కె వేదవల్లి ఫిర్యాదు చెయ్యడం జరిగింది. పోలీసు స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 211/2024 ఎఫ్ ఐ ఆర్ గా పోలీసులు నమోదు చేశారు. ఆమేరకు పోలీసు స్టేషన్ లో under section 326 (ఎఫ్) రీడ్ విత్ 3(5) భారతీయ న్యాయ సమ్మత చట్టం మరియు సెక్షన్ 4 ఆఫ్ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చట్టం 1984 ను అనుసరించి పోలీసు లు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విషయమై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టనున్నట్లు, అదే విధంగా శాఖ పరంగా కూడా విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *