Breaking News

వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యము లేకుండా నిర్వహించుకోవాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సెప్టెంబరు 7 న నిర్వహించుకునే వినాయక చవితి పండుగను పర్యావరణ కాలుష్యము లేకుండా నిర్వహించుకోవాలని, పందిళ్ళు ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచి డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, డీ ఆర్వో జి. నరసింహులు ఇతర అధికారులతో కలిసి కుల ధ్రువపత్రాలు, ఎస్సి ఎస్టీ కుల ధ్రువపత్రాలు, గణేష్ ఉత్సవాలు, సిసిఆర్సీ కార్డులు, రెవెన్యు అంశాలు, స్థానిక సంస్థల పన్నులు, పన్నేతర వసూళ్లు, ఉపాధి హామీ, పల్స్ సర్వే, పశువుల గణాంక సర్వే, మన స్కూలు – మన భవిష్యత్తు పురోగతి పై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో కుల ధ్రువీకరణ పత్రాలు కోసం 112869 దరఖాస్తులు రాగా 90,250 జారీ చేస్తూ, 318 పెండింగ్ ఉండగా, 22,301 తిరస్కరించడం జరిగిందన్నారు. తిరస్కరణ కి చెందిన వాటికి సరైన ఆధారాలు ఉంచుకోవాల్సీ ఉందన్నారు. తహశీల్దార్ వ్యక్తిగతం గా క్రాస్ చెక్ చెయ్యాలని ఆదేశించారు. పి వో ఏ (అట్రాసిటీ కేసు) కేసులకు సంబంధించి 10 మందికి చెందిన ఎస్సి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చెయ్యాల్సి ఉందని, వెంటనే పరిశీలించి ఆమేరకు ధ్రువపత్రాలు జారీ చేసి నివేదిక అందచేయాలని పేర్కొన్నారు.

గణేష్ ఉత్సవాలు సందర్భంగా మట్టి గణపతి విగ్రహాలు ఏర్పాటు చేసుకోవాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలు పర్యావరణానికి హనీ కలిగిస్తాయని పేర్కొన్నారు. ప్రజలు కూడా మట్టి గణపతి విగ్రహాలకి పూజలు చేయడం ద్వారా ఒక చక్కటి సందేశం ఇవ్వాలని కోరారు. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముందస్తుగా జిల్లా యంత్రాంగం నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. నిమజ్జనం చెసే ప్రాంతాల్లో లైటింగ్, గజ ఈతగాళ్లు ను, మెడికల్ క్యాంపు లను ఆయా శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మండపాలను తనిఖీ చేసి, తగిన భద్రత కల్పించే ఏర్పాట్లను పరిశీలించి, అనుమతులు మంజూరు చెయ్యాల్సి ఉందన్నారు. నిమజ్జనం జరిగే ప్రాంతాల్లో మునిసిపల్, జిల్లా పంచాయతీ అధికారి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. 109450 కి గాను ఇంకా 4739 రైతులకు సీసీ ఆర్సీ కార్డులు జారీ చెయ్యాల్సి ఉందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు.

ఉపాధి హామీ కింద 50 లక్షల పని దినాల లక్ష్యంలో 31.03 (83 శాతం) పూర్తి చేశారని, ప్రతి కుటుంబానికి 100 రోజుల పనిదినాలు లక్ష్యంగా, కనీసం  సగటు వేతనం రూ.250 ఉందని, తాళ్లపూడి, కడియం మండలాల్లో 267, 266 ఉందని, మిగిలిన అన్ని మండలాలు ఆ మేరకు వేతనాలు చెల్లించేలా పనులు చేపట్టాలని అన్నారు. పశు గణన, ఇంటింటి హౌజ్ ట్యాప్ కనెక్షన్లు సర్వే, మన పాఠశాల – మన భవిష్యత్తు పురోగతి లో భాగంగా పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన రాముడు, డిఆర్ఓ జి నరసింహులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *