Breaking News

అన్నా క్యాంటీన్ కు శిష్ట్లా లోషిత్ రూ.కోటి విరాళం

-పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం: లోకేష్
-చంద్రబాబు, లోకేష్ ల స్పూర్తితోనే సేవా కార్యక్రమాలు: లోహిత్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేపడుతున్న కార్యక్రమాలతో ప్రేరణ పొందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, టిడిపి కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోషిత్ అన్న క్యాంటీన్ల నిర్వహణకు కోటి రూపాయలు విరాళం అందజేశారు. ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ కు ఈ మేరకు రూ. కోటి చెక్కును అందించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్… శిష్ట్లా లోహిత్ ను అభినందించారు. లోహిత్ ఇప్పటికే కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ గా సమర్థవంతమైన సేవలు అందిస్తున్నారని చెప్పారు. అన్నా క్యాంటీన్ల కోసం లోహిత్ లాంటి పారిశ్రామికవేత్తలు పెద్దఎత్తున ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ పేదవాడు ఆకలితో ఉండకూడదన్నది చంద్రబాబు గారి ఆశయమని పేదల ఆకలి తీర్చేందుకు ఎంత ఖర్చుచేసేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. యువనేత శిష్టా లోహిత్ మాట్లాడుతూ… అయిదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో పేదలు నరకం చూశారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడంతో వారి కళ్లల ఆనందం కనబడుతోందని చెప్పారు. చంద్రబాబునాయుడు, లోకేష్ ల స్పూర్తితో ఇకముందు కూడా సంక్షేమ కార్యక్రమాలకు తమవంతు సహాయ,సహకారాలు అందిస్తానని చెప్పారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *