Breaking News

స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్ల నిధుల విడుదల

-స్థానిక సంస్థల బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యం
-సీఎం చంద్రబాబు సూచనల మేరకు నిధులు విడుదల
-గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. మేం బలోపేతం చేస్తున్నాం
-ఆర్థిక శాఖామంత్రి పయ్యావుల కేశవ్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామాల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి అని మహాత్మ గాంధీ ఆశయాలను పాటించే ప్రభుత్వం మాది. స్థానిక సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం ద్వారా అభివృద్ధికి కూటమి ప్రభుత్వం బాటలు వేస్తోంది. 15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించింది. ఇప్పుడున్న ప్రజా కూటమి ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేస్తోంది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే స్థానిక సంస్థలకు మరిన్ని నిధుల విడుదలకు నిర్ణయం తీసుకున్నాం. గ్రామ పంచాయతీలకు రూ.998 కోట్లు, పట్టణ స్థానిక సంస్థలకు రూ.454 కోట్లు విడుదలకు నిర్ణయం తీసుకున్నాం. ఈ నిధులతో గ్రామ, వార్డు స్థాయిల్లో పనులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ నిధుల విడుదలతో స్థానిక సంస్థలకు ఆర్థికంగా వెసులుబాటు కలిగే అవకాశం కలుగుతుంది. గత ప్రభుత్వం స్థానిక సంస్థలను నిర్వీర్యం చేస్తే.. ప్రజా కూటమి ప్రభుత్వం స్థానిక సంస్థల బలోపేతమే లక్ష్యంగా పని చేస్తోంది.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *