Breaking News

ఈనెల 23న గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించండి

-ప్రతి గ్రామ సభకు ప్రత్యేక అధికారిని నియమించాలి
-ఉపాధిహామీ పనులపై అవగాహన తోపాటు గ్రామాల్లో కనీస సౌకర్యాలపై చర్చించాలి
-సెప్టెంబరు 11 నుండి నూతన ఇసుక విధానం అమలు ప్రారంభం
-ఉచిత ఇసుక విధానంపై మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలి
-ఇసుక రీచ్ ల వారీగా ఇసుక తవ్వకం,రవాణా చార్జీల ధరలను నిర్ధారించండి
-ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో ఈనెల 23న ఒకేరోజు నిర్వహించే గ్రామ సభలను విజయవతంగా నిర్వహించాలని ప్రతి గ్రామ సభకు ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలక్టర్లను ఆదేశించారు.గ్రామ సభలు, ఉచిత ఇసుక విధానం అమలుపై బుధవారం రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లు,ఎస్పిలతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా ముందుగా గ్రామ సభలపై సిఎస్ మాట్లాడుతూ ఉపాధిహామీ పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు గ్రామాల్లో విద్య,వైద్యం, తాగునీరు,విద్యుత్,ఒక గ్రామం నుండి మరో గ్రామానికి,గ్రామం నుండి మండలాన్నికలిపే అనుసంధానం చేసే రహదార్లు నిర్మాణం వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఘణ,ద్రవ వ్యర్దాల నిర్వహణ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈగ్రామ సభలను ఉపయోగించాలని సిఎస్ కలక్టర్లకు స్పష్టం చేశారు.అందరు ప్రజా ప్రతినిధులు ఈగ్రామ సభల్లో పాల్గొనేలా చూడాలని అన్నారు.గ్రామ సభల నిర్వహణను జిల్లా కలక్టర్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయ వంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.గ్రామాల సర్వతో ముఖాభివృద్ధికి దోహదపడే రీతిలో ఈగ్రామ సభలను విజయంతంగా నిర్వహించాలని అన్నారు.

రాష్ట్ర పంచాయితీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ మాట్లాడుతూ ఈనెల 23న గ్రామ సభల నిర్వహణకు సంబంధించి జారీ చేసిన మార్గదర్శకాలను తుఛ తప్పక పాటించాలని చెప్పారు.ముఖ్యంగా ఉపాధిహామీ పధకం అమలుకు సంబంధించి మంజూరైన పనులు,కొత్త పనుల గుర్తింపు,సామాజిక తనిఖీపై గ్రామ సభల ద్వారా ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించాలని చెప్పారు.అంతేగాక గ్రామాల్లో నూరు శాతం కనీస సేవలు కల్పించడం,పామ్ పాండ్ల నిర్మాణం,ఉద్యానవన,పట్టుపరిశ్రమలకు తోడ్పాటు అందించడం,పశు షెడ్ల నిర్మాణం వంటి వాటిపై కూడా చర్చించి వాటి కల్పనపై దృష్టి సారించాలని అన్నారు.

సెప్టెంబరు 11 నుండి నూతన ఇసుక విధానం అమలు : సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్
రాష్ట్రంలో సెప్టెంబరు 11 నుండి నూతన ఇసుక విధానాన్ని అమలులోకి తేనున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వెల్లడించారు.ఈవిధానం అమలుకు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలను వెంటనే జారీ చేయడం జరుగుతుందని వాటిని తుచ:తప్పక పాటించాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు.ఎక్కడా ఇసుక అక్రమ రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఇసుక రీచ్ వారీగా ఇసుక తవ్వకం,రవాణాకు సంబంధించిన ధరలను కలక్టర్లు నిర్ధారించాలని ఆధరలకు మించి ఎక్కువ ధరకు విక్రయించినట్టు పిర్యాదులు వస్తే ఎంతమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. అంతేగాక ఆన్లైన్లో ఇసుక కోసం బుకింగ్ చేసిన వాహనాలకు ఏతేదీన ఏసమయంలో ఇసుకను తీసుకువెళ్లాలనేది స్పష్టంగా స్లాట్లు కేటాయించాలని అన్నారు.ఇసుక కోసం రిజిష్టర్ చేసిన వాహనాలను మాత్రమే ఇసుక రీచ్ ల్లోకి అనుమతించాలని ఇతర వాహనాలను ఎంతమాత్రం అనుమతించరాదని సిఎస్ స్పష్టం చేశారు.గుంటూరు జిల్లాకు సంబంధించి సీడ్ యాక్సిస్ రోడ్డు లోను,ఎన్టిఆర్ జిల్లాకు సంబంధించి నందిగామ వద్ద పెద్దఎత్తున లారీలు,ట్రక్కులు గంటల తరబడి వేచి ఉంటున్నట్టు గమనించామని అలాంటి పరిస్థితులు లేకుండా చూడాలని ఆరెండు జిల్లాల కలక్టర్లతో పాటు ఇతర కలక్టర్లకు సిఎస్ స్పష్టం చేశారు.

రాష్ట్ర భూగర్బ గనులశాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా మాట్లాడుతూ ఇసుక రీచ్ల నిర్వహణ,రవాణా,ధరల నిర్ధారణ అంశాలకు సంబంధించి కొన్ని గ్యాప్ లు ఉన్నయని వాటిని క్రమబద్దీకరిచేందుకు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సెప్టెంబరు 11న నూతన ఉచిత ఇసుక విధానాన్ని అమలులోకి తేనున్నట్టు ఆలోగా ఇసుక విధానాన్ని పూర్తిగా పటిష్టం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. గురువారం జిల్లాల్లో అందరు ట్రాన్సుపోర్టర్లను పిలిచి ఇసుక రవాణాకు వినియోగించే వాహనాల రిజిష్టర్ చేసి ఒక ప్రత్యేక యూనిక్ నంబరును కేటాయించాలని చెప్పారు.ఆనంబరు గల వాహనాలు మాత్రమే ఇసుక రవాణాకు ఉపయోగించాలని మరే ఇతర వాహనాలను ఇసుక రవాణాకు అనుమతించ రాదని స్పష్టం చేశారు.అంతేగాక ఇసుక తవ్వకం,రవాణాకు సంబంధించి రీచ్ లవారిగా వెంటనే ధరలను నిర్ణయించాలని చెప్పారు.ప్రతి రీచ్ వద్ద పోలీస్ చెక్ పోస్టును ఏర్పాటు చేయాలని జిల్లా ఎస్పిలను ఆదేశించారు.టోల్ ఫ్రీ నంబరుపై జిల్లాల్లో విస్తృత అవగాహన ప్రచారం చేయాలని అన్నారు.అదే విధంగా గురువారం సాయంత్రం 5గం.లకు జిల్లా కలక్టర్ల, ఎస్పిలు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉచిత ఇసుక విధానంపై వివరించాలని మీనా చెప్పారు.ఇసుక విధానం అమలుకు సంబంధించి జిల్లా సంయుక్త కలక్టర్ ను కంట్రోలింగ్ అధికారిగా నియమించాలని అన్నారు.ఇసుక అక్రమ రవాణా,అక్రమ మైనింగ్ వంటివి జిల్లాల్లో ఎక్కడ జరిగినా అందుకు జిల్లా కలక్టర్,ఎస్పిలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ముకేశ్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
ఇంకా ఈవీడియో సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి కెవివి.సత్యనారాయణ,భూగర్భ గనుల శాఖ కమీషనర్ ప్రవీణ్ కుమార్,వర్చుల్ గా జిల్లా కలక్టర్లు,ఎస్పిలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *