Breaking News

ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు పై నిర్దిష్టమైన కార్యచరణ సిద్దం

-అక్రమ మైనింగ్ విధానం పట్ల కఠినంగా వ్యవహరిస్తాము
-ట్రాన్స్పోర్ట్ ర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే 3 నెలల నిషేధం అమలు చేస్తాం
-మీడియా సమావేశం లో కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్పీ డీ నరసింహా కిషోర్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇసుక రవాణా విధానంలో నిబంధనలు ఉల్లంఘించే వాటికీ సంబంధించి ఫిర్యాదులు స్వీకరించేందుకు 18004252540 , 0833 – 2417711 కు ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు.   గురువారం స్థానిక వై జంక్షన్ వద్ద ఉన్న కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎస్పీ డీ నరసింహా కిషోర్, జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి మీడియా సమావేశం లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ఇసుక రవాణా చేసే వాహనాలు రవాణా శాఖ వద్ద పేర్లు నమోదు చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఇసుక కోసం వొచ్చే వినియోగదారుని ఫోన్ నెంబర్, చిరునామా , ఆధార్ కార్డు నెంబర్ తప్పనిసరిగా ట్రక్ షీట్ లో పొందుపరిచి తదుపరి మాత్రమే ఉచిత ఇసుకను అందచెయ్యనున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 11 నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉచిత ఇసుక విధానం లో కొత్త మార్గదర్శకాలు మేరకు పంపిణి విధానం ఉంటుందన్నారు. ఆలోగా జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ విధానం లో వినియోగదారులకు అందుబాటులో ఇసుక అందజేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. ట్రాన్స్పోర్టర్లు అధిక చార్జీలు వసూళ్లు, మధ్యవర్తుల  ప్రమేయం, రీచ్ ల వద్ద వాహనాల అనవసర నిరీక్షణ ల నివారణ, డిమాండు కు అనుగుణంగా ఇసుక సరఫరా అయ్యేలా చూడడం కోసం జిల్లా యంత్రాంగం ద్వారా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

జిల్లాలో ఉచిత ఇసుక పాలసీ అమలు చేసే విధానం లో భాగంగా ఇసుక రవాణా చేసే వాహనాలు వివరాలు ఖచ్చితంగా ఆర్టీవో వద్ద రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. రీచ్ వారీగా ఆయా వాహనాలు నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఆమేరకు రీచ్ లకి బుకింగ్ కోసం వాహనాలను అనుమతించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇసుక కోసం పేర్లు నమోదు చేసేందుకు ప్రతీ రీచ్ పాయింట్ కు చెందిన సమీపంలో ఉన్న రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ పాయింట్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇసుక అక్రమ రవాణా కు పాల్పడే వాటినీ బ్లాక్ లిస్టు లో పెట్టడం, మూడు నెలలు పాటు నిషేధం విధించడం జరుగుతుందని తెలియ చేశారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకూ ఇసుక రీచ్ వద్ద వాహనాలను రవాణాకు అనుమతించడం జరుగుతున్న దృష్ట్యా రీచ్ లోకి వాహనం వొచ్చి, ఇసుక లోడింగ్ చేసుకుని, తిరిగి బయటకి వొచ్చే సమయం ను అనుసరించి రీచ్ వారీగా వాహనాలకు స్లాట్ లని కేటాయిస్తున్నట్లు తెలిపారు. వినియోగదారుని వివరాలు ఆధారంగా క్రాస్ చెక్ చేసే వ్యవస్థను ప్రవేశ పెట్టడం , గ్రామ స్థాయి లో 20 శాతం , పోలీసులు 10 శాతం, సెబి 10 శాతం మేర క్షేత్ర స్థాయిలో ఇసుక రవాణా చేసిన ప్రాంతాల్లో తనిఖీ చేస్తారని పేర్కొన్నారు. . సీసీ కెమెరాలు ఏర్పాటు, బయో మెట్రిక్ గుర్తింపు వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామని, నోడల్ అధికారిగా జాయింట్ కలెక్టర్ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

ఎస్పీ డీ నరసింహా కిషోర్ మాట్లాడుతూ, ఇసుక అక్రమ నిల్వలు, అక్రమ రవాణా, మధ్యవర్తుల ప్రమేయం నివారించే క్రమంలో జిల్లాలో పటిష్టమైన నిఘా పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. రీచ్ లలోకి కేవలం అనుమతి పొందిన వాహనాలని అనుమతించేలా స్పష్టమైన ప్రణాళిక రూపొందించడం జరిగిందన్నారు. రీచ్ ల వద్ద ఎటువంటి క్యూ లైన్లు లేకుండా నిర్వహణా వ్యవస్థ పటిష్టం చేసామన్నారు. రైతు సేవా కేంద్రాల లో రిజిస్ట్రేషన్ పాయింట్ వద్ద నమోదు చేసిన తదుపరి రీచ్ వద్ద వరకూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్. చిన్న రాముడు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *