Breaking News

గ్రామ పంచాయతీలను స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం

-జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్
-ప్రతి ఒక్కరూ గ్రామ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలి : సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలo

నారాయణవనం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి గ్రామపంచాయతీలో ప్రజల సమస్యలు పరిష్కరించి, స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. శుక్రవారం నారాయణవనం మండలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించిన గ్రామ సభలో సత్యవేడు ఎంఎల్ఏ కోనేటి ఆదిమూలం తో కలిసి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ … రాష్ట్రమంతటా ఈ గ్రామ సభలు నిర్వహిచుకోవటం అనేది చరిత్రలో ఇంతక మునుపెనన్నడు జరగలేదని, గౌ. ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతిలో గ్రామసభలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు కోనసీమ జిల్లాలో ఒక గ్రామ సభ కు హాజరవుతున్నారని, ఇలా ప్రతి ఒక్క ప్రజా ప్రతినిధి, జిల్లా అధికారులు, మండల స్థాయి అధికారులు ఎక్కడో ఒక చోట గ్రామ సభ కు హాజరవుతున్నారని, గౌ. ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర ప్రదేశ్ గా రాష్ట్రాని తీర్చి దిద్దాలనుకున్నారని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతి గ్రామం కూడా స్వర్ణాoద్ర ప్రదేశ్ లో భాగం కావాలని, ఒక గ్రామానికి ఏమేమి కావాలో, ఆ గ్రామంలో నివశిస్తున్న ప్రజల కనీస సౌకర్యాలు గురించి ప్రణాళికల నిర్దేశించుకొని ప్రతి కుటుంబానికి మరుగుదొడ్లు నిర్మాణం, రోడ్లు నిర్మాణం, విద్యుత్, నీటి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ తదితర మౌలిక సదుపాయాల గురించి గ్రామ సభలో తీర్మానించి పరిష్కరించేలా చర్యలు చేపడతామని తెలిపారు. ఒక గ్రామ పంచాయతీ కి సంబందించి కనెక్టివిటీ లేని రోడ్లను గుర్తిస్తూ వాటిని ఏర్పాటు కొరకు ప్రణాలికలు ఏర్పాటు కావాలని అన్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి చెందాలంటే వ్యవసాయం, పాడి రైతులు, ఊరిలో పశువులకు అవసరమైన షెడ్లను గుర్తించి , చెరువులకు పూడిక తీతలు మొదలైన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా ఉపాధి హామీ పథకం ద్వారా అభివృద్ధి పరచుకోనుటకు షెల్ఫ్ ఆఫ్ వర్క్స్ ప్రణాలికలు ఏర్పాటు జరగాలని అన్నారు. ఏం.ఎల్.ఏ గారు ఇదే పంచాయతీ నుండి 40 సంవత్సరాలుగా మీ అందరి కోసం చాలా కష్ట పడ్డారని, మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించి వారి ఉన్నతికి పాటు పడ్డారని తెలిపారు.

ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున గౌ. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గ్రామసభలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, అదేవిధంగా ఎం.ఎల్.ఎ మంత్రులు, సర్పంచులు అందరూ కూడా గ్రామ సభలకు హాజరు అవుతున్నారని తెలిపారు. గ్రామాలలో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ లో భాగంగా ఒక పక్క ఉపాది కల్పిస్తూ.. గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లా గౌ.కలెక్టర్ అహర్నిశలు కష్టపడి జిల్లా అభివృద్దికి కృషి చేస్తున్నారని వారికి మనందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. గ్రామీణ ప్రాంతాలకు ముఖ్యంగా కావాలసినవి రోడ్లు, విద్యుత్, త్రాగు నీరు, మరుగుదొడ్లు సౌకర్యం అని ప్రజలకు అందుబాటులోని తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు. ప్రతి నెల ఇస్తున్న పెన్షన్లను పెంపు చేసి లబ్ధిదారుల గడపవద్దకే వెళ్లి అందజేయడం జరుగుతోందని తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి గ్రామ నిర్మాణం తో గ్రామ వికాసం దిశగా అడుగులు వేయాలన్నారు. ప్రజలు చెయ్యి చెయ్యి కలిపి గ్రామాభివృద్ధికి సమస్టి కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సత్యవేడు డిఎస్పి రవికుమార్, సర్పంచ్ శారదమ్మ , తాసిల్దార్ జయరాములు, ఎంపీడీవో కృష్ణమూర్తి, జిల్లా నీటి యాజమాన్య సంస్థ పధక సంచాలకులు శంకర్ ప్రసాద్ తదితరులు, పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *