Breaking News

ఫీజులు చెల్లించని ప్రకటనల బోర్డ్ లకు సంబందించి తొలగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో అనధికార, ఫీజులు చెల్లించని ప్రకటనల బోర్డ్ లకు సంబందించి తొలగింపు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, రోడ్ల పక్కన ఆక్రమణల తొలగింపు కూడా వేగంగా చేపట్టాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ఆదేశించారు. శనివారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో బకాయిలు చెల్లించని, అనధికార ప్రకటనల బోర్డ్ ల తొలగింపు ప్రక్రియ వేగంగా చేపట్టాలన్నారు. మీడియా డివైజ్ ఫీజుల బకాయిదార్ల నుండి ఫీజులు చెల్లించని వారి పై చట్టపర చర్యలు తీసుకోవడానికి కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. రోడ్ల మార్జీన్లు, డ్రైన్ల మీద ఆక్రమణల వలన ట్రాఫిక్ సమస్యలు వస్తున్నాయని, వెంటనే ఆక్రమణల తొలగింపు చేపట్టాలన్నారు. స్ట్రీట్ వెండర్స్ జోన్ల ఏర్పాటుకు సంబందించి ఫైల్ సిద్దం చేయాలన్నారు. ఫ్లేక్సీలు రోడ్ల మీద ఇష్టానుసారం ఏర్పాటు చేస్తున్నారని, వాటిని ఎప్పటికప్పుడు దళం బృందాల ద్వారా తొలగించాలన్నారు. అనధికార నిర్మాణాలపై పలు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిని నిర్మాణ తోలి దశలోనే అడ్డుకోవాలని, ప్లానింగ్ కార్యదర్శులు మరింత యాక్టివ్ గా విధుల్లో ఉండాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, కార్యదర్శులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రతి శుక్రవారం పట్టణ ప్రణాళిక శాఖ సమీక్షా సమావేశం జరుగుతుందన్నారు.
సమావేశంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఏసిపి మురళి, టిపిఎస్ లు సువర్ణ కుమార్, లక్ష్మణ స్వామి, రసూల్, సర్వేయర్ లోకేష్, టిపిబిఓలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *