Breaking News

మొక్కలు నాటండి మహావృక్షాలుగా పెంచండి

-మొక్కలు నాటుదాం వాటిని సంరక్షిద్దాం.
-మంత్రి కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
మొక్కలు నాటడం, వాటి సంరక్షణ బాధ్యతలను చేపట్టడం ద్వారా నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తామని ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక జడ్పీ హైస్కూల్లో వనం మనం కార్యక్రమంలో మంత్రి కందులు దుర్గేష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు నరసరావుపేట లో జరిగే వనం మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. వారి స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించుకోవడం ద్వారా అనుకున్న లక్ష్యాలు సాధ్యమవుతాయన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పిలుపు ఇచ్చారు. ఒక మొక్కను మహావృక్షంగా మార్చడంలో భాగస్వామ్యం కావాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధిస్తామన్నారు. ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వనం మనం కార్యక్రమం ఒక సామాజిక చైతన్యాన్ని కలిగించే కార్యక్రమని ఇందులో భాగస్వామ్యం అవడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో మన వంతు బాధ్యతను నిర్వహిద్దామన్నారు. సెప్టెంబరు రెండో తేదీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలన్నారు. మొక్కలు నాటి వాటి పురోభివృద్ధికి కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపు నివ్వడం జరిగిందన్నారు. అదే తనకు నిజమైన పుట్టినరోజు కానుక అని ఉప ముఖ్యమంత్రి పేర్కొనడం, సమాజం పట్లబాధ్యత మన అంకితభవాన్ని చాటేందుకు ఇదో చక్కటి అవకాసం గా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.

ప్రభు త్వ పాఠశాలల్లో జూనియర్ కళాశాలలో డిగ్రీ కళాశాలలో  ఎకో క్లబ్ ఏర్పాటు చేస్తే  విద్యా ర్థులకు మొక్కలు నాటడం పై  ఆసక్తి పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్, భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్, టిఎల్ పిఎస్ఎస్.కృష్ణవేణి, ఎంపిడిఓ, పి.శా మ్యూల్, మండల తాసిల్దార్ బి.నాగరాజు నాయక్, ఏ ఈ.ఎస్. హేమంత్,ఎంఈఓ, కే ఎన్ వి. గురు మూర్తి, పాఠశాల హెచ్ ఎం, సిహెచ్. పద్మ, నాయకులు రంగా రమేష్, బండి సత్యనారాయణ, నీలం రామా రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *