Breaking News

డిగ్రీ విద్యార్థుల‌కు ఆర్‌బీఐ క్విజ్ పోటీలు

-స‌ద్వినియోగం చేసుకోవాలి: క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్‌బీఐ నిర్వ‌హించే క్విజ్ పోటీల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న అన్నారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపించి 90 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా డిగ్రీ విద్యార్థుల‌కు క్విజ్ పోటీల‌కు శ్రీకారం చుట్టింది. ఇందుకు సంబంధించిన గోడ ప‌త్రిక‌ను క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న.. జాయింట్ క‌లెక్ట‌ర్ డా. నిధి మీనా త‌దిత‌రుల‌తో క‌లిసి శుక్ర‌వారం క‌లెక్ట‌ర్ క్యాంపు కార్యాల‌యంలో ఆవిష్క‌రించారు. ఈ క్విజ్ పోటీల‌కు ప్ర‌తి క‌ళాశాల నుంచి ఎంత‌మందైనా టీమ్‌గా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. ఒక బృందానికి క‌నీసం ఇద్ద‌రుండాలి. సెప్టెంబ‌ర్ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో (www.rbi90quiz.in/students/ register) రిజిస్ట్రేష‌న్ చేసుకోవాలి. ఆన్‌లైన్‌, రాష్ట్ర‌స్థాయి, జోన‌ల్‌, తుది రౌండ్‌లు ఉంటాయ‌న్నారు. విజేత‌ల‌కు వివిధ స్థాయిల్లో రూ. ల‌క్ష నుంచి రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు న‌గ‌దు బ‌హుమ‌తులుంటాయ‌ని లీడ్ బ్యాంక్ మేనేజ‌ర్ కె.ప్రియాంక తెలిపారు. కార్య‌క్ర‌మంలో ఎల్‌డీఎం కె.ప్రియాంక‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీనివాస‌రావు, డీటీసీ ఎం.పురేంద్ర త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *