Breaking News

జస్టిస్ బి.శ్యామ్ సుందర్ సేవలను కొనియాడిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ బి.శ్యామ్ సుందర్ ఎన్నో సమగ్రమైన(కాంప్రెహెన్సివ్)కేసులను పరిష్కరించారని ఆయన అందించిన సేవలను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జిస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రత్యేకంగా కొనియాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా సేవలందించిన జస్టిస్ శ్యామ్ సుందర్ ఆదివారం పదవీ విరమణ చేయనున్న సందర్భంగా శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టుహాల్లో పుల్ కోర్టు ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం జరిగింది. ఈకార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో న్యాయవాదుల కుటుంబంలో జన్మించిన జస్టిస్ శ్యామ్ సుందర్ పాఠశాల విద్యను అక్కడే పూర్తి చేయగా గ్రాడ్యుయేషను ను ఎస్వి విశ్వవిద్యాలయంలోను, న్యాయవాద డిగ్రీని కర్నాటక గులర్బాలో పూర్తి చేసి 1986లో న్యాయవాదిగా నమోదై వృత్తి జీవనాన్ని మొదలు పెట్టారన్నారు.మున్సిఫ్ మెజిస్ట్రేట్ గా,జిల్లా న్యాయమూర్తిగా పలు జిల్లాల్లో పని చేయడంతో పాటు విజయవాడ మెట్రోపాలిటన్ న్యాయమూర్తిగాను సేవలందించారని తెలిపారు.అదే విధంగా 2022 నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ శ్యామ్ సుందర్ సేవలందిస్తున్నారని చీఫ్ జస్టిస్ ఠాకూర్ చెప్పారు.జస్టిస్ శ్యామ్ సుందర్ ఉన్నతమైన నైతిక విలువలు,ఇంటిగ్రిటినీ పాటిస్తూ న్యాయ వ్యవస్థలో మంచి సేవలందించారని ముఖ్యంగా ఆయన అనేక కాంప్రెహెన్సివ్ కేసులను పరిష్కరించారని గుర్తు చేశారు.లైబ్రరీ,ఇతర కమిటీల చైర్మన్ గా కూడా ఎన్నో ప్రసంశనీయమైన సేవలు అందించారని చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పేర్కొన్నారు.
పదవీ విరమణ చేయనున్న జస్టిస్ బి.శ్యామ్ సుందర్ మాట్లాడుతూ దేశంలో ఏహైకోర్టుకు లేని విశిష్టత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు ఉందని అదేమంటే ఉమ్మడి మద్రాసు హైకోర్టుగా ఆతదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా ప్రస్తుతం సేవలందించడం జరుగుతోందని పేర్కొన్నారు.అనంతపురం జిల్లాకు చెందిన తాను 1986లో న్యాయవాదిగా వృత్తి జీవితాన్ని మొదలుపెట్టి అంచెలంచెలుగా ఈస్థాయికి చేరుకునేందుకు పూర్తి తోడ్పాటును అందించిన తన తల్లిదండ్రులకు,కుటుంబ సభ్యులకు, ప్రధాన న్యాయమూర్తి,సహచర న్యాయమూర్తులు,న్యాయవాదులకు ప్రతి ఒక్కరికీ పేరుపేరున కృతజ్ణతలు తెలిపారు.హైకోర్టు న్యాయమూర్తిగా కొలీజియం సిఫార్సు చేయడంలో కృషి చేసిన పూర్వపు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రస్తుత సర్వోన్నత న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు ఎల్లవేళలా కృతజ్ణుడనై ఉంటానని పేర్కొన్నారు.మానవాళికి న్యాయం చేరువ కావడం అనేది వారి కనీస హక్కు అని ఆదిశగా తన కెరీర్ లో పూర్తి స్థాయిలో కృషి చేయడం జరిగిందని జస్టిస్ శ్యామ్ సుందర్ ఈసందర్భంగా గుర్తు చేసుకున్నారు.అదే విధంగా ప్రజలకు సకాలంలో న్యాయ సేవలు అందించడం కూడా ముఖ్యమని అన్నారు.రెండేళ్ళుగా న్యాయమూర్తిగా సేవలు అందించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టు జస్టిస్ శ్యామ్ సుందర్ పేర్కొన్నారు.
ఈకార్యక్రమంలో హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,ఎపి హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు చిదంబరం,ఎపి బార్ కౌన్సిల్ అధ్యక్షులు ద్వారకానాధ్ రెడ్డి,పబ్లిక్ ప్రాసిక్యూటర్ లక్ష్మీ నారాయణ,డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పి.పొన్నారావులు మాట్లాడుతూ జస్టిస్ శ్యామ్ సుందర్ న్యాయవ్యవస్థకు అందించిన సేవలను కొనియాడారు. ఈకార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పాల్గొనగా హైకోర్టు రిజిష్ట్రార్ జనరల్ వై.లక్ష్మణ రావు,అదనపు అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్,పలువురు రిజిష్ట్రార్లు,న్యాయాధికారులు, పలువురు బార్ అసోసియేషన్,బార్ కౌన్సిల్ సభ్యలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *