Breaking News

స్విమ్స్ ఆధ్వర్యంలో తాళ్వాయిపాడులో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్విమ్స్, శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ఆధ్వర్యంలో సోమవారం చెంబేడు పిహెచ్ సి పరిధిలోని తాళ్వాయిపాడు సచివాలయం వద్ద ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో తిరుపతి జిల్లాలో రెండు పింక్ బస్సుల ద్వారా మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వేగవంతంగా జరుగుతోంది. ఇందులో మహిళలు, పురుషులకు నోటి క్యాన్సర్ పరీక్షలు, మహిళలకు రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలను ఉచితంగా నిర్వహించారు. ఈ క్యాంపునకు విశేషంగా ప్రజలు విచ్చేసి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో చెంబేడు పిహెచ్ సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి.చంద్రమోహన్ రెడ్డి, స్విమ్స్ శ్రీ బాలాజీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి.హరిత, సర్పంచ్ కల్పన, పంచాయతీ కార్యదర్శి జనార్దన్, నర్సింగ్ సిబ్బంది, స్థానిక వైద్య సిబ్బంది, ఎంల్ హెచ్ పి, ఏఎన్ఎం, ఆశా వర్కర్లు పాల్గొన్నారు.

మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వివరాలు

చెంబేడు పిహెచ్ సి పరిధిలో…

– సెప్టెంబర్ 4న కానూరు.

– సెప్టెంబర్ 6న బంగారంపేట.

దొరవారిసత్రం పిహెచ్ సి పరిధిలో…

– సెప్టెంబర్ 9న పూలతోట.

– సెప్టెంబర్ 11న తనియాలి.

– సెప్టెంబర్ 13న ఉచ్చూరు.

– సెప్టెంబర్ 18న నెలబల్లి.

– సెప్టెంబర్ 20న కొత్తపల్లి.

– సెప్టెంబర్ 23న పోలిరెడ్డిపాడు

– సెప్టెంబర్ 25న యెకొళ్ళు.

– సెప్టెంబర్ 27న వేనుంబాక.

తొగరమూడి పిహెచ్ సి పరిధిలో…

– సెప్టెంబర్ 30న కల్లూరు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *