Breaking News

మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి ఆర్జీలకు గడువులోపు పరిష్కారం చూపాలి

-పరిష్కరించిన ఫిర్యాదులు మరల రీ ఓపెన్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలి : జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందే ప్రతి ఆర్జీని నిర్దేశిత గడువులోగ పరిష్కారం చూపాలని, రీ ఓపెన్ అయిన ప్రతి ఆర్జీని జాగ్రత్తగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలోని పలు శాఖల జిల్లా అధికారులు, మండల, గ్రామ స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు అందిన ఫిర్యాదుల పరిష్కారం మరియు రీ ఓపెన్ చేసిన ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… మీకోసం – ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) ద్వారా ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశిత గడువులోగా పరిష్కారం చూపుతూ, రీఓపెన్ కాకుండా జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపారు. మీకోసం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలకు సంబంధించిన అర్జీలకు పరిష్కార దిశగా అధికారులు కృషి చేయాలని తెలిపారు. అర్జీదారుని సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరించిన అర్జీల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. పరిష్కరించలేని ఫిర్యాదు ఐనచో సదరు కారణాన్ని అర్జీదారునికి స్పష్టంగా తెలియచేయాలని,వారితో స్వయంగా మాట్లాడాలని తెలిపారు. నిర్ణీత గడువు దాటితే చర్యలు ఉంటాయని తెలిపారు. జల జీవన్ మిషన్ పథకం కు సంబంధించిన పల్స్ సర్వేలను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు.

జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్న సందర్భంగా వైద్య అధికారులు ప్రతి ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించాలని, ప్రతి శుక్రవారం గ్రామాలలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాలను నిర్వహించి, దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్నం భోజనం పథకంకు సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్, ఎడ్యుకేషన్ సెక్రటరీ ప్రతివారం రెండు రోజులు స్థానిక పాఠశాలలను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, ప్రధానోపాధ్యాయులు శ్రద్ధ పెట్టాలన్నారు. వసతి గృహాలలో ఇటీవల నమోదైన డయేరియా కేసుల నేపథ్యంలో బయట భోజనం పిల్లలకు అనుమతించరాదని, నాణ్యమైన భోజనం అందేలా సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. వంద రోజుల లక్ష్యం మేరకు జిల్లాల్లో గృహ నిర్మాణాలను పూర్తిచేసేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, సంబందిత హౌసింగ్ సిబ్బందితో సమీక్షించుకోవాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స కు తిరుపతి ఆర్ డి ఓ నిశాంతి రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్, ఇతర మునిసిపల్ కమిషనర్లు, ఆర్డీఓ లు, గ్రామ వార్డు సచివాలయ అధికారిణి సుశీల దేవి, డిప్యూటీ సీఈఓ ఆదిశేషరెడ్డి, పిడి డిఆర్డీఎ ప్రభావతి, జిల్లా సాంఘిక సంక్షేమ మరియు సాధికార అధికారి చెన్నయ్య తదితర జిల్లా స్థాయి మరియు మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *