Breaking News

సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించండి…

-జిల్లా కలెక్టర్: డా ఎస్.వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని, కాలుష్య రహిత పర్యావరణహిత ఇంధన వినియోగం కొరకు సౌర విద్యుత్ ఉత్పత్తి ని చేపట్టి వినియోగంలోనికి తీసుకువచ్చే విస్తృత ప్రణాళికలను రూపొందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ డా ఎస్.వెంకటేశ్వర్ ఆదేశించారు. నేటి మంగళవారం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సౌర విద్యుత్ ఉత్పత్తి మరియు వినియోగం పై పై నెడ్ క్యాప్ డెవలప్మెంట్ అధికారి దిలీప్ కుమార్ రెడ్డి తో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సౌర విద్యుత్తు ఉత్పత్తిని ప్రోత్సహించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను తీసుకువచ్చిందని ఇందులో భాగంగా పి.ఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకాన్ని తీసుకువచ్చిందని తెలిపారు. ఈ పథకం ను జిల్లాలో అమలుపరచడానికి ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. 7 గురు సభ్యులతో కూడిన కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్ పర్సన్ గా మరియు ఆరుగురు మెంబర్లుగా జిల్లా పరిషత్ సి.ఈ. ఓ, లీడ్ బ్యాంక్ మేనేజర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.పి.డి.సి.ఎల్, జిల్లా అధికారి నెడ్ క్యాప్, మరియు ఇతర సిబ్బందితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సదరు కమిటీ పీ.ఎం. సూర్యఘర్ ముఫ్తీ బిజిలి యోజన అమలును పర్యవేక్షిస్తుంది అని తెలిపారు.

ఈ పథకం ద్వారా గృహ వినియోగదారులు స్వయంగా తామే తమ ఇంటి పై భాగంలో సౌర విద్యుత్ తయారు చేసుకునే మరియు వినియోగించుకునే వెసులుబాటును కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ కల్పిస్తూ ప్రోత్సహిస్తోందని తెలిపారు. అందుకు ఆసక్తి గలవారు దరఖాస్తును పి.ఎం సూర్య ఘర్ పోర్టల్ నందు అప్లై చేసుకోవాలని తెలిపారు. ఒక కిలో వాట్ కు 30 వేల రూపాయలు, రెండు కిలో వాట్ లకు 60 వేల రూపాయలు, మూడు కిలో వాట్ లు మరియు ఆ పైన యూనిట్లకు 78 వేల రూపాయలు కేంద్రం నుండి సబ్సిడీ వినియోగదారుని ఖాతాలో నేరుగా జమ అవుతుంది అని తెలిపారు. 100 కిలో వాట్లు పైబడిన ప్రభుత్వ కార్యాలయాలలో ఎన్.వి.వి. ఎన్ మరియు నెడ్ క్యాప్ ఫేజ్ -1 లో సౌర విద్యుత్తు ప్లాంట్లు అమర్చడానికి సంబంధిత అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. మోడల్ సోలార్ విలేజ్ కోసం 5000 జనాభా ఉన్న 5 గ్రామాలను తీసుకొని వాటిని సోలార్ గ్రామాలుగా తీర్చి దిద్దే ప్రణాలికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *