Breaking News

4 నుంచి నగరంలో ‘వసంతం 2024’

-క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఏపీ చైర్ పర్సన్ ఎస్ రంజన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రాప్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఈ నెల 4,5 తేదీలలో నగరంలోని శేష సాయి కళ్యాణ వేదికలో వసంతం 2024 నిర్వహించనున్నట్లు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ చైర్ పర్సన్ ఎస్ రంజన, సంయుక్త కార్యదర్శి బి సుజాత తెలిపారు.ఈ సందర్భంగా మంగళవారం నగరంలోని శేష సాయి కళ్యాణ వేదికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీరు మాట్లాడుతూ రెండు రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో భారతదేశం నలుమూలల నుండి చేనేత కార్మికులు పాల్గొంటున్నారన్నారు. ఇందులో పాల్గొనేవారు తమ ప్రాంతాల నేత కార్మికులు, కళాకారులతో కలిసి పనిచేసిన డిజైన్లను ప్రదర్శిస్తారన్నారు. ఈ సారి మనకు పిచ్వాయి కళ, తోలు బొమ్మలు, జూటీలు, వివిధ రకాల బ్యాగులు, బుట్టలు, బంజారా నీడిల్ క్రాప్ట్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, బనారస్, కోట, గద్వాల్ నుండి బాబిన్ లేస్, రాగి గంటలు, రాతి చేతి పనులు, అల్లికలు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాకుండా చందేరి, లక్నో చికంకారి, కాంజీవరం, కర్ణాటక, ప్రింటెడ్ టస్పార్ లో సాధారణ దుస్తులు, యువకులకు మనస్సుకు నచ్చే ఎన్నో దుస్తులు, హస్తకళలు ఇక్కడ ప్రదర్శించ బడతాయనీ తెలియజేశారు. మ్యాచింగ్, మిక్సింగ్, క్యాజువల్స్, పిల్లలకు నచ్చె దుస్తులు, ఇలా మరెన్నో ఉత్పత్తులు అన్ని ఒకేచోట మీకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. ఈ రొండు రోజులలో ప్రదర్శించబడే స్టాల్స్ సంఖ్య 70 కంటే ఎక్కువగా ఉండగా అందులో క్రొత్తగా 24 మంది భాగస్వాములు ఇందులో చేరి వారి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నారన్నారు. ఈ వసంతం కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయం హస్త కళాకారుల కోసం, మా కార్యక్రమాలన్నింటికి నిధుల కోసం ఉపయోగపడుతుందన్నారు. ఈ వసంతం 2024 కార్యక్రమాన్ని నాలుగో తేదీ ఉదయం 10 గంటలకు ముఖ్య అతిధిగా గుమ్మళ్ళ సృజన (ఐఏఎస్), యన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్, మెజిస్ట్రేట్ ప్రారంభిస్తారనీ తెలియజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *