Breaking News

నగరంలో ‘సైమా బ్యూటీ ఎక్స్ పో’ ప్రారంభం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలోని స్థానిక ఎస్ఎస్ కన్వెన్షన్ లో సైమా బ్యూటీ ఎక్స్ పో ప్రారంభమైనట్లు ఎస్ బి ఎం ఎస్ కో ఫౌండర్, డైరెక్టర్ బి రాఘవీరెడ్డి, సైమా ఫౌండర్ మోక్ష్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మీరు మాట్లాడుతూ రెండు రోజులపాటు జరిగే బ్యూటీ ఎక్స్ పో లో అందుబాటు ధరలలో బ్యూటీ ప్రోడక్ట్స్ ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే తమ లక్ష్యం అన్నారు. సైమా బ్యూటీ ఎక్స్పో అనేది ముంబాయి, తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ తో పాటు మరికొన్ని ముఖ్య నగరాలలో నిర్వహించామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో నిర్వహిస్తున్న ఈ బ్యూటీ ఎక్స్ పో మొదటిదని రాబోయే రోజుల్లో విశాఖపట్నం తిరుపతిలో నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ ఎక్స్ పోలో బ్రైడ్స్ మెహందీ, హెయిర్ కట్, సెల్ఫ్ మేకప్ కోర్స్, బేసిక్ అడ్వాన్స్డ్ ప్రొఫెషనల్ బ్రైడల్ మేకప్, ట్రెండింగ్ హెయిర్ స్టైల్స్, సారీ డ్రాపింగ్ అండ్ బాక్స్ ఫోల్డింగ్, ఫ్లవర్ మేకింగ్, బేసిక్, అడ్వాన్స్ బ్యూటీ పార్లర్ కోర్స్, కంప్లీట్ హైడ్రా ఫేషియల్ కోర్స్, బేసిక్ అడ్వాన్స్డ్ హెయిర్ కట్స్, నెయిల్ ఎక్స్టెన్షన్ క్లాసెస్ సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజర్ కే.శ్రీనివాస్(మాలియో కాస్మెటిక్స్), బి.శ్రీనివాస్ (బీ ఈ బీ కాస్మెటిక్స్), ఎం.శ్రీనివాస్(ఫెయిర్ టచ్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్), విల్సన్ తదితరులు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *