Breaking News

మూడో రోజు జిల్లా నుండి విజయవాడ కు పంపిన ఆహార పదార్ధాలు  కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉదారత చాటుతూ, స్వచ్ఛందంగా స్పందించి ముందుకు వచ్చిన వ్యక్తులకు, కాంట్రాక్టర్లకి ,  పారిశ్రామిక వేత్తలకు , విద్యా సంస్థలకు, స్వచ్ఛంధ సంస్థలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

పారిశ్రామిక దాతలు
సామాజిక బాధ్యతగా స్పందించిన పారిశ్రామివేత్తలు కంపెనీ ప్రతినిధులకు ఈ సందర్భంలో ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నామన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపుకు స్పందించి జిల్లా యంత్రాంగం విజ్ఞప్తిని గౌరవిస్తూ ఉదాహరణ ఆపదలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరు వారి వంతు గా మానవత్వం చాటుకున్నారన్నారు.

పరిశ్రమల తరఫున స్పందించిన దాతల వివరాలు
టాగూర్ లేబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్, తుప్పాకులగూడెం(V), తాళ్లపూడి(M) , . KPR ఆగ్రో కెమికల్ లిమిటెడ్, బిక్కవౌల్,  సర్వరాయ షుగర్స్ లిమిటెడ్, (బాట్లింగ్ యూనిట్), వేమగిరి (V), కడియం(M), ది ఆంధ్రా షుగర్స్ లిమిటెడ్ కొవ్వూరు మరియు సగ్గొండ యూనిట్ , .పరమేసు బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్, దేవరపల్లి(V & M), అవంతి ఫీడ్స్ లిమిటెడ్, కొవ్వూరు/ బండాపురం యూనిట్లు, ఐ.టి.సి. లిమిటెడ్- అగ్రి బిజినెస్ డివిజన్, అనపర్తి ,  చక్ర ఆయిల్స్ & ఎక్స్‌ట్రాక్షన్ (పి) లిమిటెడ్, రామచంద్రపురం (వి) అనపర్తి, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, బలభద్రపురం (V) , బిక్కవోల్(m) , హిందుస్తాన్ యూనిలీవర్ లిమిటెడ్, దౌలేశ్వరం (V) , రాజమండ్రి రూరల్ , గెయిల్ రాజమండ్రి, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, రాజమండ్రి టెర్మినల్, గోకవరం , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, గుమ్మలదొడ్డి (V), గోకవరం, కార్గిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, వడిసలేరు (V), రంగంపేట , త్రివేణి ప్యాటర్న్ గ్లాస్ ప్రైవేట్ లిమిటెడ్, కొండగూడెం(V), దేవరపల్లి , సుభోదయ కెమికల్స్ లిమిటెడ్, గౌరీపట్నం(V&M), అస్సాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, గోకవరం , 3F ఆయిల్ పామ్ ఆగ్రో టెక్ ప్రైవేట్ లిమిటెడ్, యెర్నగూడెం(V), దేవరపల్లి , విజన్ డ్రగ్స్ [p] లిమిటెడ్, కొండగూడెం(V) , దేవరపల్లి , భాగ్యనగర్ క్లోరైడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, సగ్గొండ(V), కాప్రికార్న్ డిస్లరీ ప్రైవేట్ లిమిటెడ్, అన్నదేవరపేట(వి), తాళ్లపూడి(మ) ,  చక్ర పాల ఉత్పత్తులు, ఆవుపాడు(వి), నల్లజెర్ల(ఎం) , శ్రీతిక్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వీరంపాలెం (v) , రాజానగరం(M)

విద్యా సంస్థల తరఫున దాతలు:
విద్యా సంస్థలు తరపున స్పందించిన తూర్పు గోదావరి జిల్లా ప్రవేటు స్కూల్స్ అసోసియేషన్స్ కు, తిరుమల విద్యా సంస్థలకు , ఆదిత్యా స్కూల్స్ సంస్థలకు , అనపర్తి బుద్దరాజు సోసైటీ లకు కృతఙ్ఞతలు వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల జిల్లా యూనియన్ 10,000 ప్యాకెట్లు , తిరుమల స్కూల్స్ 20,000, ఆదిత్య స్కూల్స్ 5,000 , అనపర్తి బుద్ధరాజు సొసైటీ  పొలమేరు 5000 ప్యాకెట్లు పంపడం జరిగిందన్నారు.

ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రీ భోజనం పంపిన వాటి వివరాలు:
ఉదయం అల్పాహారం కోసం జిల్లా నుంచి 19 వాహనాలు ద్వారా 1,99,300 వాటర్ ప్యాకెట్లు, 45 వేల ఆహారా ప్యాకెట్లు, లక్ష బిస్కెట్ ప్యాకెట్లు, పంపడం జరిగిందన్నారు . 16 మంది కాంట్రాక్టర్లు, 3  దాతలు సహకారంతో వాటినీ విజయవాడ పంపినట్లు తెలిపారు. స్థానికంగా కేటరింగ్ నిర్వచించే క్యాటరర్ లు ద్వారా ఆహారాన్ని వండించి పంపినట్లు తెలిపారు.
పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జిల్లాలు దాతల నుంచి సేకరించిన 26, 700 టెట్రా ఒక లీటరు పాల ప్యాకెట్లు పంపడం, అక్కడ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఇప్పటికే అందచెయ్యడం జరిగిందన్నారు. ఈరోజు సాయంత్రం మరో 20 వేల పాల ప్యాకెట్లు పంపేందుకు సిద్ధం చేస్తున్నట్లు కలెక్టరు ప్రశాంతి తెలిపారు.
మధ్యాహ్నం భోజనం సదుపాయం కోసం 13 వాహనాల ద్వారా 27,400 ఫుడ్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్, ప్యాకెట్లు పంపడం జరిగిందన్నారు. రెవిన్యూ, జిల్లా యంత్రాంగం తరపున అవసరమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. తహసీల్దార్ల ఆద్వర్యంలో దాతలు, కాంట్రాక్టర్ల ద్వారా పెరవలి మండలం 2500 ఫుడ్ ప్యాకెట్లు, ఉండ్రాజవరం మండలం 2500 వాటర్ ప్యాకెట్లు , 2500 ఫుడ్ ప్యాకెట్లు, కోరుకొండ మండలం 2500 ఫుడ్ ప్యాకెట్లు , సీతానగరం మండలం 15 బాక్సు ప్యాకెట్లు 1500 ఆహార పదార్థాలు, అనపర్తి మండలం 2500 ఫుడ్ ప్యాకెట్లు, బిక్కవోలు మండలం 200, రంగంపేట మండలం 2500 ఫుడ్ ప్యాకెట్లు, గోకవరం మండలం 2500 ఫుడ్ ప్యాకెట్లు , చాగల్లు మండలం 2500 ఫుడ్ ప్యాకెట్లు , రాజమండ్రి అర్బన్ 1400 ఫుడ్ ప్యాకెట్లు సేకరించి పంపించడం జరిగిందన్నారు . జిఎస్ఎల్ వారి ఆధ్వర్యంలో 2,3 ప్యాకెట్లు వికాసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మా కోరుకొండ వారి ఆధ్వర్యంలో 7000 వాటర్ బాటిల్స్, పంపామన్నారు.
రాత్రి భోజనం సదుపాయం కోసం సేకరించిన 20 వేల ఆహారపు ప్యాకెట్లు, 4 వేలు వాటార్ బాటిల్స్, రెండు వేలు బిస్కెట్ ప్యాకెట్లు పంపినట్లు తెలిపారు. తాహసిల్దార్ లు నిడదవోలు ఆధ్వర్యంలో 2500 ఫుడ్ ప్యాకెట్లు, తాళ్లపూడి 2500 , బిక్కవోలు – 4000 ఫుడ్ ప్యాకెట్లు, 2000 బిస్కెట్ ప్యాకెట్లు 4000 వాటర్ బాటిల్స్, ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ తరపున 5000 ఫుడ్ ప్యాకెట్లు, కమర్షియల్ టాక్స్ వారి ఆధ్వర్యంలో 6000 ఫుడ్ ప్యాకెట్లు ఆర్డీవో రాజమండ్రి ద్వారా 20 వేల వాటర్ బాటిల్స్ పంపామన్నారు. ఆర్ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో మరో 25 వేలు వాటర్ బాటిళ్లు, 50 50,000 వాటర్ ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *