Breaking News

దుకాణములు, వ్యాపార సంస్థలన్నీ కార్మిక శాఖ లైసెన్సులు పొందాలి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాలోని దుకాణములు, వాణిజ్య, వ్యాపార, సంస్థలు, మోటార్ రావాణా వాహన యాజమాన్యాలు, భవన మరియు ఇతర నిర్మాణ సంస్థలు, కాంట్రాక్టు లేబర్ ని వినియోగించే కాంట్రాక్టర్లు, PRINCIPAL ఎంప్లాయర్లు అంతర్రాష్ట్ర వలస కార్మికులను వినియోగించే సంస్థలు యజమానులు విధిగా కార్మిక చట్టాల కింద వెంటనే ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ చట్టం 2015 కింద రిజిస్ట్రేషన్ చేసుకుని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొంది ఉండాలని తూర్పుగోదావరి జిల్లా డిస్ట్రిక్ ఇన్చార్జి ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, రాజమహేంద్రవరం బి.యస్.యం. వల్లి  బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. రాజమహేంద్రవరం లోని స్థానిక కార్మిక శాఖ కార్యాలయంలో ది 04-09-2024 నాడు వివిధ వ్యాపార సంఘాల ప్రతినిధులు మరియు యజమానులతో సమావేశాన్ని నిర్వహించి ఈ విషయం మీద అవగాహన కల్పించారు. ఆంధ్ర ప్రదేశ్ దుకాణములు సంస్థల చట్టం, 1988, బిల్డింగ్ మరియు ఇతర నిర్మాణ వర్కర్స్ యాక్ట్, 1996: కాంట్రాక్టు లేబర్ ఆక్ట్, 1970; పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ ఆక్ట్, 1972, మోటార్ రవాణా వర్కర్స్ ఆక్ట్, 1961: బీడీ అండ్ సిగార్ వర్కర్స్ ఆక్ట్, 1966; ఇంటర్ స్టేట్ మైగ్రాంట్ వర్కర్స్ ఆక్ట్ 1979 క్రింద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన సంస్థలన్నీ విడి విడిగా కాకుండా ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రేషన్ ఆక్ట్, 2015 క్రింద కార్మిక చట్టలన్నిటికి ఒకే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ / లైసెన్సు పొందే వెసులుబాటు ఉన్నదని వారు తెలిపారు. అన్ని మీసేవ కేంద్రాల్లో ఈ రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సేవలు అందుబాటులో ఉన్నవి కావున సద్వినియోగం చేసుకొనవలసినదిగా కోరారు ఇదివరకే కార్మిక చట్టాల క్రింద రిజిస్ట్రేషన్ చేసుకున్న సంస్థలు వాటి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లను రెన్యువల్ చేసుకోవాలని కూడా కోరారు సెప్టెంబర్ నెల 30 వ తేదీలోపు ఈ విధముగా రిస్ట్రేషన్ చేసుకొని రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందకపోతే చట్టపరమైన చర్యలకు గురి అవుతారని తెలియ చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *