Breaking News

రాజమండ్రీ రూరల్ లో కలెక్టర్ పర్యటన

-స్థానికులతో సమస్యల పై వివరాలు అడిగి తెలుసుకున్న కలెక్టర్
-ఆక్రమణలు తొలగింపు, శానిటేషన్ పనులుపై సమీక్ష
-సమస్య పరిష్కారం కోసం క్షేత్ర స్థాయిలో పర్యటన
– కలెక్టర్ ప్రశాంతి

ధవళేశ్వరం, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో రాజమండ్రీ రూరల్ పరిథిలో పలు ప్రాంతాలు ముంపుకు గురి కావడం తో, అక్కడ ఆక్రమణ లకి గురి అయ్యే అవకాశాలు ఉన్న ప్రాంతాలను పరిశీలించి, తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. బుధవారం స్థానిక మండల స్థాయి అధికారులతో కలిసి కలెక్టర్ పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి కి , స్ధానికులు నగరం లోని వృధా జలాలు  ఆవా డ్రైయిన్ ద్వారా ధవళేశ్వరం సాయి బాబా టెంపుల్ వద్ద గోదావరీ లోకి పంపడం జరుగుతోందని, గోదావరి నదీ కి వరదలు సమయంలో రూరల్ మండలం లోని పలు ప్రాంతాలు ముంపుకు గురి అవుతున్నట్లు వివరించారు. ఆక్రమణలని తొలగించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా, ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టరు ప్రశాంతి మాట్లాడుతూ, క్షేత్ర స్థాయి లో వాస్తవ పరిస్థితి ని అంచనా వేసేందుకు పర్యటన చేస్తున్నట్లు తెలిపారు. గతంతో నగరంలో వరదలు సమయంలో పర్యటించిన అనంతరం అధికారులకి ఆదేశాల ను ఇచ్చినట్లు తెలిపారు. ఆర్ అండ్ బి  కల్వర్టు నిర్మాణం పనులను,  డివిజనల్ పంచాయతీ అధికారులు శానిటేషన్ పనులను చేపట్టడం తో పాటు ఆక్రమణ లని తొలగించాలన్నారు. ఆక్రమణ వలన ఇక్కడ ముంపు సమస్య ఉత్పన్నం అయితే సంబంధిత అధికారులు, సిబ్బందే వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్షేత్ర స్థాయిలో అధికారులు ముంపు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎంపిడివో డీ. శ్రీనివాస్,  పిడి డిఆర్డిఎ ఎన్వివిఎస్ మూర్తి, ఇంచార్జీ తహసిల్దార్ రమ్య, స్ధానికులు తదితరులు పాల్గొన్నారు

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *