Breaking News

వరద బాధితులకు ఉద్యోగుల భారీ సాయం – రూ.120 కోట్ల విరాళం

-వరద బాధితులకు ఏపీ ఎన్జీవో జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు.
-వారి ఒకరోజు వేతనం రూ.120 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
-ఈ క్రమంలో సీఎం చంద్రబాబును కలిసి అంగీకారపత్రం అందించారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు అన్ని రంగాల వారు ముందుకు వస్తున్నారు. ముందుకొచ్చిన ఈ దాతలు వరద బాధితుల కోసం ప్రభుత్వానికి తోచినంత విరాళాలు ఇందిస్తున్నారు. అయితే తాజాగా వరద బాధితుల కోసం ఉద్యోగుల నుంచి భారీ విరాళం అందింది. ఏకంగా రూ.120 కోట్లు విరాళమిచ్చేందుకు ముందుకు వచ్చారు.

ఏపీ ఎన్జీఓ భారీ విరాళం: రాష్ట్రంలో వరద బాధితులను ఆదుకునేందుకు ఏపీ ఎన్జీఓ జేఏసీ నేతలు భారీ విరాళం ప్రకటించారు. ఉద్యోగుల సెప్టెంబర్‌ నెల జీతంలో ఒక రోజు బేసిక్‌ పే ద్వారా రూ.120 కోట్లు సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. పెన్షనర్లు కూడా ఈ విరాళంలో భాగమైనట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అంగీకార పత్రాన్ని ఏపీ జేఏసీ నేతలు కేవి శివారెడ్డి, విద్యాసాగర్‌ తదితరులు సీఎం చంద్రబాబును కలిసి అందజేశారు. వరద సహాయం నిమిత్తం మొత్తం 8 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లు విరాళం అందించారు. వారిని సీఎం చంద్రబాబు అభినందించారు.

ఆంధ్ర విశ్వవిద్యాలయం: వరద బాధితులకు ఆంధ్ర యూనివర్శిటీ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం సహాయనిధికి విరాళం ఇస్తున్నట్లు ఏయూ ఉద్యోగులు, సిబ్బంది తెలిపారు.

ఆర్టీసీ కార్మిక పరిషత్‌: వరద బాధితులకు సాయం చేసేందుకు ఆర్టీసీ కార్మిక పరిషత్‌ ముందుకొచ్చింది. ఒకరోజు వేతనం విరాళం ఇచ్చేందుకు సిద్ధమైనట్లు ఆర్టీసీ కార్మిక పరిషత్‌ తెలిపింది. మిగతా సంఘాలతో ఏపీపీటీడీ ఎండీ మాట్లాడాలని కార్మిక పరిషత్‌ నేతలు కోరారు. సీఎం రిలీఫ్ ఫండ్​కు విరాళం ఇచ్చేందుకు ఆర్టీసీ కార్మిక అధ్యక్షుడు సూరపనేని శేషగిరిరావు అనుమతి కోరారు. ఆర్టీసీలోని మిగతా సంఘాలూ ముందుకురావాలని ప్రచార కార్యదర్శి యార్లగడ్డ రమేశ్‌ పిలుపునిచ్చారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *