Breaking News

కంసాలిపాలెం- మాధవరం మార్గంలో ఎర్ర కాలువ ప్రవాహాన్ని పరిశీలించిన జెసి చిన్న రాముడు

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
నిడదవోలు మండలం పరిధిలో కంసాలిపాలెం- మాధవరం మార్గంలో ప్రవహిస్తున్న  రహదారి పైకి ఎర్రకాల్వ నీరు  చేరడంతో క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులకు అంచనా వేయడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తెలిపారు. గురువారం నిడదవోలు తహసీల్దార్ బి. నాగరాజు నాయక్ , ఇతర అధికారులతో కలిసి జెసి పరిస్థితులను సమీక్షించారు. గోదావరీ నదికి వరద ఉధృతి, మరో పక్క ఏజన్సీ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కారణంగా ఎర్ర కాలువ ప్రవాహ స్థాయి పెరిగి తూర్పు – పశ్చిమగోదావరి జిల్లాలకు రాకపోకలు ఆటంకాలు ఎదురైనట్లు తెలిపారు.  గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు, ఎర్రకాల్వ నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న కారణంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండల కంసాలిపాలెం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూ డెం మండలం మాధవరం గ్రామాలకు రాక పోకలు పూర్తిగా నిలిచిపోయాయనీ , ఈ ప్రాంతం వాసులకి ప్రధాన రహదారి మార్గం లో నిత్యం స్థానికంగా నివాసం ఉండే ప్రజలు, ఇక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఉద్యోగులు,  రైతులు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవడం జరిగిందన్నారు..ఎటువంటి ప్రమాదం జరుగకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రజల్ని అప్రమత్తం చెయ్యడం జరిగిందన్నారు. కలెక్టర్ వారి ఆదేశాల మేరకు క్షేత్ర స్థాయిలో పర్యటించినట్లు జెసి చిన్న రాముడు పేర్కొన్నారు..ఈ రహదారి మార్గంలో తక్షణ పనులు చేపట్టడం తో పాటు శాశ్వత పరిష్కారం దిశగా ప్రతిపాదనలు సిద్దం చేసి చేసి ప్రభుత్వానికి నివేదించనున్నట్లు తెలిపారు. అనంతరం కాటా కొటేశ్వరం ఎఫ్ సి ఐ గోడౌన్ ను తనిఖీ చేసి, విజయవాడ వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల చొప్పున బియ్యం పంపిణీ చేసే కార్యక్రమన్ని క్షేత్ర స్థాయిలో పర్యవేక్షణా చేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *