Breaking News

ఏపీ, తెలంగాణలకు కేంద్రం తక్షణం వరద సాయం అందించాలి

-ఎంపీ సంతోష్ కుమార్
-ప్రజలకు శాపంగా పరిణమించిన బుడమేరు, కొల్లేరు ఆక్రమణలు.
-సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏపీ తెలంగాణలకు కేంద్రం తక్షణమే వరద సాయం అందించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్లో సిపిఐ పక్ష నేత, ఎంపీ సంతోష్ కుమార్ డిమాండ్ చేశారు. బుడమేరు, కొల్లేరు పరివాహక ప్రాంతాల ఆక్రమణలే విజయవాడ నగర ప్రజల పాలిట శాపంగా పరిణమించాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా దుయ్యబట్టారు. శనివారం నాడు విజయవాడ, భవానీపురం, జోజినగర్ లో ఇంటింటికి వెళ్లి వరద ముంపులో చిక్కుకున్న వారికి సిపిఐ ఆధ్వర్యంలో దుప్పట్లు, టవల్స్ లను సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంటులో సిపిఐ పక్ష నాయకులు, ఎంపీ సంతోష్ కుమార్; సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ఏపీలో వరద విపత్తు కలచివేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఏపీ, తెలంగాణలకు వరద సాయం ప్రకటించి అందించాలని డిమాండ్ చేశారు.

రామకృష్ణ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా బుడమేరు ముంపు సమస్య విజయవాడ నగరవాసులను వేధిస్తోందన్నారు. బుడమేరకు శాశ్వత పరిష్కార మార్గం చూపాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో వరద విజయవాడ నగరాన్ని ముంచెత్తి అపార నష్టాన్ని మిగిల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుడమేరు కాలువ నానాటికీ ఆక్రమణలతో కుదించుకుపోతున్నా అధికార యంత్రాంగం కళ్ళు మూసుకోవడం తీవ్రమైన తప్పిదమన్నారు. వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరు సరస్సు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొని, ఆక్రమణలకు గురవటం బాధాకరమన్నారు. బుడమేరు, కొల్లేరు ఆక్రమణలు ప్రజలకు శాపంగా పరిణామించాయన్నారు. బుడమేరుకు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి పూనుకోవాలని; నదులు కాలువలు, వాగులు, వంకలు, చెరువులు పరిరక్షణకు తెలంగాణలోని హైడ్రా తరహాలో ఒక నిర్దిష్ట ప్రణాళికతో ఆక్రమణదారులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి ధోనేపూడి శంకర్, నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి నక్కా వీరభద్రరావు, కార్యవర్గ సభ్యులు తాడి పైడియ్య, కొట్టు రమణరావు, AISF రాష్ట్ర అధ్యక్షులు జాన్సన్ బాబు, కోశాధికారి ఎం. సాయి కుమార్, బందెల నాసర్ జి , మస్తాన్ స్థానిక పార్టీ నాయకులు జి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *