-మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టామని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. విజయవాడ నగర వ్యాప్తంగా ముంపు ప్రాంతాల్లో అధికారులతో కలిసి పర్యటించానని తెలియజేశారు. సామాజిక మాధ్యమాలలో మేయర్ మిస్సింగ్ అని పోస్టులు పెడుతున్నారని, అట్టివారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. వరద ముంపుకు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఇలాంటి దుర్మార్గపు పోస్టులు పెట్టడం సరైన విధానం కాదని మండిపడ్డారు. మా ఇల్లు కూడా వరద పంపు గురైన సరే…ప్రజలు శ్రేయస్సు కోరుతూ విజయవాడ నగర వ్యాప్తంగా అధికారులతో కలిసి పర్యటించి ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పించమని తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు ముంపు ప్రాంతాల ప్రజలకు అన్ని వసతులు నగర పాలక సంస్థ ద్వారా అందిస్తున్నామని పేర్కొన్నారు.