Breaking News

పారదర్శకంగా పత్తి కొనుగోళ్లు

-మార్కెటింగ్ శాఖ, సీసీఐ పరిధిలో 50 పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు 
-పత్తి కొనుగోలుకు మార్గదర్శకాలు 
-గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోలు-
-5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా 
-రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెనాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా పారదర్శకంగా పత్తి కొనుగోళ్ల ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖామంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మార్కెటింగ్ శాఖ, కాటన్ కార్పొరేషన్ ఆద్వర్యంలో రాష్ట్రంలో మొదటి దశలో 50 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం గరిష్టంగా రూ.7521/- మద్దతు ధరకు కొనుగోళ్లు చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు, కొనుగోలు ప్రక్రియకు నూతన మార్గదర్శకాలు విడుదల చేసినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ఈ ఏడాది 5.79 లక్షల హెక్టార్లలో 6 లక్షల టన్నుల దిగుబడి అంచనా వేసినట్లు తెలియచేశారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ గుర్తించిన మార్కెట్ యార్డులు, జిన్నింగ్ మిల్లుల్లోనే కొనుగోళ్లు జరిగే విధంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆద్వర్యంలో కొనుగోళ్ల ప్రక్రియ జరగడంతో పాటు ఆన్లైన్ కొనుగోలు విధానం కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో ప్రమాదాలు జరుగకుండా తగు చర్యలు తీసుకోవడంతో పాటు సీసీ కెమేరాల ఏర్పాటు, బీమా సదుపాయం కలిగి ఉండాలని అధికారులను ఆదేశించామన్నారు. పత్తి సేకరణకు కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల వరకు అనుమతి ఇచ్చామని, రైతుల ప్రయోజనం కోసం సాయంత్రం 6 గంటల వరకు అంటే అదనంగా ఒక గంట గ్రేస్ పిరియడ్ గా కేటాయించామన్నారు. పత్తి కొనుగోలు కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించేందుకు జిల్లా జాయింట్ కలెక్టర్, మర్కెటింగ్, వ్యవసాయ అధికారులు, పోలీసు, అగ్నిమాపక అధికారులతో కలిపి కమిటీ ఏర్పాటు చేసామని తెలియచేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *