Breaking News

వరద నష్టంపై ఆందోళన వద్దు

-బాధితులతో మంత్రి సవిత భరోసా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వరద వల్ల జరిగిన నష్టాన్ని సచివాలయ ఉద్యోగులు ఇంటింటికీ వచ్చి నమోదు చేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖాశామాత్యులు ఎస్.సవిత భరోసా ఇచ్చారు. మంగళవారం విజయవాడ నగరంలోని 54, 55, 56 డివిజన్లలో టీడీపీ నాయకులు ఎంఎస్ బేగ్ , సుబ్బారావు జగన్ మోహన్ తో మంత్రి పర్యటించారు. ముందుగా 54, 55 డివిజన్లలో…తరవాత 56 డివిజన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కలియ తిరిగారు. ఈ సందర్భంగా ఆమె ఇంటింటికీ, షాపులకు వెళ్లి బాధితులతో మాట్లాడారు. వరదల వల్ల అన్నీ కోల్పోయి రోడ్డున పడ్డామని బాధితులు వాపోయారు. కట్టుకున్న బట్టలు సైతం బురదలో తడిచిపోయి, వాడుకోడానికి వీలులేకుండా పోయాయని, గృహోపకరణాలు, వాహనాలు పాడైపోయాయన్నారు. దీనిపై మంత్రి సవిత స్పందిస్తూ…ఎవరూ ఆందోళన చెందొద్దని, సీఎం చంద్రబాబునాయుడు అన్ని విధాలా ఆదుకుంటారని భరోసా ఇచ్చారు. ఇంటింటికీ వచ్చి సచివాలయ ఉద్యోగులు వచ్చి… ఎంత నష్టం జరిగిందో నమోదు చేసుకుంటారన్నారు. ఆయా నష్టాల బట్టి ప్రభుత్వం సాయమందిస్తుందని మంత్రి తెలిపారు. ఫైరింజన్లతో ఇళ్లు, షాపులు శుభ్రం చేయించుకోవాలని సూచించారు. అనంతరం నిత్యావసర సరుకులను బాధితులకు మంత్రి పంపిణీ చేశారు. రేషన్ కార్డులేకున్నా…ఆధార్ కార్డు ఆధారంగా సరకులు పంపిణీ చేయాలని అధికారులకు మంత్రి స్పష్టంచేశారు.

మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకున్నారు…
సీఎం చంద్రబాబు తమను గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్నారని..అన్ని విధాలా ఆదుకున్నారని 56 డివిజన్ పాత రాజరాజేశ్వరిపేట కొత్త మసీదు వాసులు మంత్రి సవితకి తెలిపారు. వరదలు వచ్చిన రోజు నుంచి నేటి వరకూ అన్ని విధాలా తమకు సాయమందిస్తూ వస్తున్నారన్నారు. తినే తిండికి లోటు లేకుండా చూసుకున్నారన్నారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని, ఆయన వల్లే ఇంత పెద్ద విపత్తు నుంచి త్వరగా బయటపడ్డామని ఆనందం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ…మీ కష్టాన్ని సీఎం చంద్రబాబు గుర్తించారని, అన్ని విధాలా ఆదుకోనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, పలువురు అధికారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *