Breaking News

ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆపరేషన్ బుడమేరు..

– ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రణాళికాయుత చర్యలు
– భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా పటిష్ట ప్రణాళికలు అమలు
– రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి పొంగూరు నారాయణ
– రాష్ట్ర బీసీ సంక్షేమం; చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత
రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకాలకు అనుగుణంగా ఆపరేషన్ బుడమేరును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మునిసిపల్, ఇరిగేషన్ శాఖ, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టనున్నట్లు వివరించారు. ఆక్యుపై చేసినవారికి ఎలాంటి ఇబ్బందీలేకుండా ప్రత్యామ్నాయాల్ని చూపి సమస్యలను పరిష్కరించనున్నట్లు వివరించారు. వరద ప్రవాహానికి ఎలాంటి ఇబ్బందీ లేకుండా అత్యంత పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించి అమలు చేయనున్నట్లు వివరించారు. ముఖ్యంగా మునిసిపల్ ప్రాంతాల్లో నీటి ప్రవాహ మార్గాలు బాగా కుంచించుకుపోయాయని.. వీటిపై సమగ్ర సర్వే చేసి పరిస్థితిని చక్కదిద్దనున్నట్లు వివరించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం నాటికి పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తిచేయనున్నట్లు తెలిపారు.  ముఖ్యమంత్రి సూచనలకు అనుగుణంగా ఐఏఎస్ మొదలు కిందిస్థాయి అధికారి వరకు ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారని వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు రాకుండా ఉండేందుకు అన్ని విధాల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని.. ఆపరేషన్ బుడమేరును విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.

వరద సహాయ కార్యక్రమాల్లో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు
– రాష్ట్ర బీసీ సంక్షేమం; చేనేత, జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత
వరద విపత్తును ఎదుర్కోవడంలో భాగస్వాములైన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమం; చేనేత, జౌళి శాఖ మంత్రివర్యులు ఎస్.సవిత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కలెక్టర్ కార్యాలయాన్ని క్యాంపు కార్యాలయంగా మార్చుకొని ప్రతి ఒక్కరికీ సహాయ కార్యక్రమాలకు సంబంధించి మార్గనిర్దేశం చేశారన్నారు. మంత్రులు ఏమి చేయాలి? ఎమ్మెల్యేలు ఏమి చేయాలి? ఏ అధికారి ఏ పని చేయాలి? అని చాలా స్పష్టంగా వివరిస్తూ సహాయ కార్యక్రమాలు విజయవంతంగా నడిచేందుకు రాత్రింబవళ్లు కృషిచేశారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకునేందుకు ముందుకొచ్చి విరాళాలు అందించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు మంత్రి ఎస్.సవిత తెలిపారు.

రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ కలెక్టరేట్లో మాట్లాడుతూ..
కృష్ణానది, బుడమేరు నుంచి వచ్చిన అకాల వర్షంతో వచ్చిన వరద కారణంగా విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తిందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కలెక్టరేట్ కేంద్రంగా సెప్టెంబర్ 1 నుంచి 10 వరకు నిర్విరామంగా ఫీల్డ్ విజిట్ చేస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలను భాగస్వామ్యం చేస్తూ ఆయన చేసిన సేవలు ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలు మరిచిపోరని అందుకు వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నామన్నారు. వరదల్లో ఎన్టీఆర్, కృష్ణా జిల్లా అతలాకుతలం అయిందని.. ముఖ్యమంత్రి సేవలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. 32 డివిజన్ల లో వరదల వల్ల ప్రజలు నష్టపోగా, జక్కంపూడి, అంబాపురం వంటి ప్రాంతాల్లో కలుపుకుని 179 సచివాలయాల్లో టీం వర్క్ తో ముందుకు వెళ్లారన్నారు. ముఖ్యమంత్రి అపార అనుభవంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ 9 రోజుల్లోనే విజయవాడ నగరం సాధారణ స్థితికి చేరేలా కృషి చేసారు. బుడమేరుకు పడిన గండ్లను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్లు క్లోజ్ చేయడంలో చాలా అద్భుతంగా పనిచేశారన్నారు. మంత్రి లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో మంత్రి రామానాయుడు, నారాయణలు కూడా నిరంతరం పనిచేసారన్నారు

మంత్రి నారాయణ నిరంతరం పర్యవేక్షిస్తూ శానిటేషన్, వాటర్ సప్లై అందేలా, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ , విద్యుత్ కనెక్షన్లు
100% కరెంటు ఇవ్వగలిగినందుకు వారి కృతజ్ఞతలు అన్నారు. కోటి 20 లక్షల ఫుడ్ ప్యాకెట్స్,, రేషన్ ను 2,40,000 మందికి సప్లై చేయాల్సి ఉండగా రెండు లక్షల 187 మందికి ఆరు రకాల వస్తువులతో సప్లై చేయగలిగామన్నారు. 150 బోట్లు, 24 ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలు, 6 హెలికాప్టర్ల తో వరద బాధిత ప్రాంతాల్లో సేవలందించగలిగారు. నూతన సాంకేతికతను అందుబాటులో తెచ్చి డ్రోన్స్ ద్వారా ఫుడ్ పాకెట్స్ మనుషులు వెళ్లలేని చోటుకు కూడా అందించాం. కనీవిని ఎరుగని రీతిలో సాంకేతికతను ఉపయోగించడం జరిగింది. ఇప్పటివరకు ప్రజలు, ఉద్యోగులు ముఖ్యమంత్రి పిలుపునకు స్పందించి 270 కోట్లు విరాళాలుగా అందించినందుకు అభినందిస్తున్నామన్నారు. ఇలాంటి విపత్తులు అందరూ ఇన్వాల్వ్ కావటం మంచి పరిణామం. ముఖ్యమంత్రి వినాయక చవితిని కూడా విజయవాడ కలెక్టరేట్లో చేసుకోవటం ఆయన అంకితభావానికి నిదర్శనం. సెంట్రల్ టీం రెండోసారి వస్తుంది. మంత్రులు, అధికారులు ఇందులో భాగస్వామ్యమైన వారందరికీ అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *