Breaking News

టీచర్ గా మారి విద్యార్థినులకు పలు అంశాలపై బోధన చేసిన జిల్లా కలెక్టర్ డా. ఎస్.వెంకటేశ్వర్

-ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (PM SHRI) కార్యక్రమం రేణిగుంట జడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల నందు అమలు తీరు స్ఫూర్తిదాయకంగా ఉంది

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం(PM SHRI) కింద ఎంపిక కాబడిన రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి సదరు పథకం అమలు తీరు బాగుందని, స్ఫూర్తిదాయకంగా ఉందని, మరింతగా మెరుగుదలతో ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దేలా ఉపాధ్యాయులు మరిన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేయాలని, పిఎంశ్రీ పాఠశాలలకు వరం అని తెలుపుతూ తాను టీచర్ గా మారి విద్యార్థినులకు పలు అంశాలపై జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ బోధన చేసి పేర్కొన్నారు.

మంగళవారం రేణిగుంట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ముందుగా ప్రాంగణంలోని సరస్వతి అమ్మవారిని దర్శించుకుని, 6వ తరగతి నందు పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ లో పిల్లలు టాబ్ లు వినియోగించి బేసిక్ గణితం సబ్జెక్ట్ ను లెర్నింగ్ ను పరిశీలించి పిల్లలతో మాట్లాడుతూ సబ్జెక్ట్ ట్యాబ్ లోని కంటెంట్ అర్థం అవుతుందా అని ఉపయోగకరంగా ఉందా అని అడిగి వారు వాడుతున్న విధానాన్ని పరిశీలించి, విద్యార్థుల స్పందన పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. పర్సనలైజ్డ్ అడాప్టివ్ లెర్నింగ్ ల్యాబ్ నందు ఇంగ్లీష్, గణితం, తెలుగు సబ్జెక్ట్ లను ట్యాబ్ ల ద్వారా బేసిక్ అంశాలపై 6వ తరగతి నుండి 9 వ తరగతి విద్యార్థినులకు విద్య ఉంటుందని అధికారులు తెలిపారు. పాఠశాలలో 495 మంది బాలికలు విద్యను అభ్యసిస్తున్నారు అని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులకు ఐ ఎఫ్ బి ప్యానెల్స్ వినియోగించి విద్యాబోధన చేయుచున్న ఉపాధ్యాయురాలు, విద్యార్థినులతో మాట్లాడుతూ వారికి అర్థమయ్యే రీతిలో బోధన ఉందా అని పిల్లలతో కొన్ని ఫిజిక్స్, కెమిస్ట్రీ అంశాలపై ఐ ఎఫ్ బి ప్యానెల్ పై వివరించమని, తాను పలు అంశాలపై విద్యార్థినులకు వివరించారు. టీచర్ గా మారి విద్యార్థినులకు పలు అంశాలపై బోధన చేసి మాట్లాడుతూ సబ్జెక్ట్ పై పట్టు ఉండేలా, దాని అప్లికేషన్ ఎక్కడ వాడతారు అనేదానిపై అవగాహన ఉంటే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఉపయోగం ఉంటుందని తెలిపారు. ఇంటర్నెట్ సౌకర్యం తో పిల్లలకు విద్యాబోధన కు ఎంతో ఉపయోగపడుతుందని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మన బడి మన భవిష్యత్తు పనులు పురోగతిలో ఉన్నాయని అధికారులు వివరించారు. అనంతరం పాఠశాల ఆవరణలోని ఆట స్థలాన్ని పరిశీలించి ఎన్ఆర్ఎస్ జిఎస్ అనుసంధానంతో చేపట్టాల్సిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని పిడి కి తెలిపారు. ఇంటర్మీడియేట్ వారికి సంబంధించిన సైన్స్ ల్యాబ్, ఐఎఫ్ బి సబ్జెక్ట్ సమాచారాన్ని పరిశీలించి బాగుందని కలెక్టర్ అన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం ను డీఈఓ శేఖర్ తో కలిసి తిని భోజనం శుచిగా బాగుందని అన్నారు. మరుగుదొడ్లను, ఆర్ఓ ప్లాంట్ ను పరిశీలించారు. అనంతరం సమగ్ర శిక్ష కింద ఏర్పాటు చేసిన ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ గదిని పరిశీలించి విద్యార్థినులు తయారు చేసిన వివిధ ఐటమ్ లను పరిశీలించారు. సదరు టీచర్లు పిఎం శ్రీ సహకారంతో పని చేస్తున్నారని తెలిపారు.

ఈ సందర్భంగా మీడియాతో కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా కార్యక్రమం కింద ఎంపిక చేయబడిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, నాణ్యమైన విద్యకు సంబంధించి బలోపేతం చేసే దిశగా భారత ప్రభుత్వం సహకారం అందిస్తోందని, సదరు సదుపాయాలను సద్వినియోగం చేసుకుని పిల్లలకు మంచి విద్యను, నాణ్యతగా, మౌలిక వసతులతో, లైబ్రరీ, లాబొరేటరీ వంటి ఏర్పాట్లతో అందించే దిశగా మన జిల్లాలో ఎంపిక అయిన 40 పాఠశాలలు బెస్ట్ ప్రాక్టీసెస్ అమలు చేస్తూ విద్యా శాఖ జిల్లాలోని సదరు 40 పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధన వినూత్న బోధనా పద్ధతులతో, డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు, క్రీడలు నిర్వహణతో, మౌలిక సదుపాయాల మెరుగుదలతో, కెమిస్ట్రీ ప్రయోగశాలలు తదితర ఏర్పాటుతో, విద్యార్థులకు స్పష్టంగా అర్థం అయ్యే రీతిలో వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇందులోని ఉత్తమ పాఠశాలలు ప్రధానమంత్రి అవార్డు కు ఎంపిక అవుతాయని తెలిపారు. విద్యా బోధన లో ఒక కొత్త ఒరవడితో విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించడం జరుగుతుందని, ఈ కార్యక్రమం కింద కేంద్ర ప్రభుత్వం 66% నిధులు మరియు 34% రాష్ట్ర ప్రభుత్వం నిధులు అందిస్తాయని తెలిపారు. మన జిల్లాలో మొదటి దశ కింద 23 పాఠశాలలు రెండవ దశ కింద 17 పాఠశాలలు ఎంపిక కాబడినాయని వీటిని జాతీయ విద్యా విధానం 2020 మార్గదర్శకాల మేరకు ఉత్తమ పాఠశాలలుగా, బాధ్యతాయుత బాల బాలికలు, విద్యార్థులుగా తీర్చి దిద్ది వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఇంక్లూజీవ్ విద్య అందించేలా తీర్చిదిద్దడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ తెలిపారు. విద్యార్థులలో స్కౌట్స్, ఎన్సిసి వంటి భావజాలం అలవర్చి, నాయకత్వ లక్షణాలు పెంపొందేలా స్టూడెంట్ క్లబ్స్, ఎకో క్లబ్స్ వంటివి పాఠశాలలలో ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. 23 పాఠశాలల్లో పది కెమిస్ట్రీ ల్యాబ్ లకు ఒక్కొక్కటికి 15.58 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నాయని, ఇరవై ఒక్క పాఠశాలలకు క్రీడా ప్రాంగణాలు అభివృద్ధికి ఒక్కొక్క పాఠశాలకు 5 లక్షల నిధులతో పనులు పురోగతిలో ఉన్నవి అని, ఒకేషనల్ ఎడ్యుకేషన్ ను పాఠశాలల్లో అందిస్తూ చర్యలు తీసుకోవడం జరుగుతోందని, జిల్లా పరిషత్ బాలికల హై స్కూల్ రేణిగుంట లో వారు అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, చేపడుతున్న కార్యక్రమాలు బాగున్నాయని కలెక్టర్ తెలిపారు.

హెచ్ ఎం విష్ణు వర్ధనం వివరిస్తూ వారి పాఠశాలకు సంబంధించిన వెబ్సైట్ ఏర్పాటు చేశామని, వారు చేపట్టిన బెస్ట్ ప్రాక్టీసెస్, కార్యక్రమాలను సోషల్ మీడియాలోఅప్లోడ్ చేయడం జరుగుతోందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీ కాళహస్తి రవి శంకర్ రెడ్డి,జిల్లా అకడమిక్ మానిటరింగ్ అధికారి మరియు నోడల్ అధికారి పిఎంశ్రీ శివ శంకర్, డిప్యూటీ విద్యాధికారి బాలాజీ, కేవికె రాస్ హెడ్ డా. శ్రీనివాస్, సర్వశిక్షా ప్లానింగ్ అధికారి రామచంద్ర రెడ్డి, సిఎంఓ, రేణిగుంట తాసిల్దార్ సురేష్, ఎంపిడిఓ విష్ణు తదితర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *