Breaking News

శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

-ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

శ్రీకాళహస్తి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కావలసిన ఆధునిక పరికరాలు, లాబొరేటరీ శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రి నందు అందుబాటులో ఉన్నాయని, ఏదైనా తక్కువ ఉన్నవాటిని నిబంధనల మేరకు త్వరలో అందుబాటులోకి తెస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అని, వైద్యాధికారులు మెరుగైన వైద్యం ప్రజలకు అందించాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ సూచించారు.

బుధవారం మధ్యాహ్నం శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి ఆసుపత్రి మొత్తం కలియ తిరిగి వార్డులో అడ్మిషన్ లో ఉన్న పేషెంట్ తో మాట్లాడుతూ చికిత్స ఎలా ఉంది అని, డబ్బులు ఏమైనా తీసుకున్నారా అని, ఆహారం ఆస్పత్రిలో అందిస్తున్నది ఎలా ఉందని ఆరా తీశారు. సర్జరీలు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కింద చేస్తున్నారా అని అడుగగా వారు ఎన్టీర్ ఆరోగ్యశ్రీ కింద సర్జరీ చేశారని, మెరుగైన వైద్యం అందిస్తున్నారని, ఆహారం బాగుందని తెలిపారు. అనంతరం లేబరేటరీని పరిశీలించి ఆధునిక పరికరాలు, తదితర ఎక్విప్మెంట్లు, రక్త పరీక్షల సదుపాయాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయలక్ష్మి, సిఎస్ ఆర్ఎమ్ఓ డాక్టర్ మధు తదితర వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్షించి మాట్లాడుతూ వారు తెలిపిన వివరాల మేరకు ఆస్పత్రి జనరేటర్ చాలా కాలం నుండి పనిచేయడం లేదని తెలుపగా ఎమ్మెస్ఐడిసి అధికారికి కలెక్టర్ ఫోన్లో మాట్లాడి వారంలోపు జనరేటర్ మరమ్మతులు పూర్తిచేయాలని ఆదేశించారు. అలాగే కంటి ఆపరేషన్లు చేసే సీనియర్ కంటి వైద్యాధికారి అందుబాటులో ఉన్న నేపథ్యంలో ఆప్తాల్మిక్ ఓటి సేవలు కంటి శాస్త్ర చికిత్సలు ఈనెల 20 వ తేదీ నుండి అందుబాటులోకి రావాలని ఆదేశించారు. ప్రతి రోజు ఏరియా ఆసుపత్రికి సుమారు 500 పైన రోగులు ఓ.పి ఉంటుందని వైద్యాధికారులు తెలిపారు. డెంటల్ ఇంప్లాంట్ కొరకు వైద్యాధికారులు కొంత పరికరాలు కావాల్సి ఉన్నాయని తెలుపగా కలెక్టర్ దానిపై సానుకూలంగా స్పందించి ఆసుపత్రి సూపరింటెండెంట్ కు సూచనలు చేశారు. జనరల్ మెడిసిన్ వైద్యాధికారి పోస్టు ఖాళీగా ఉన్నదని తెలుపగా ప్రత్యామ్నాయ ఏర్పాట్ల కొరకు డిప్యూటేషన్ చర్యలు తీసుకోవాలని డిసిహెచ్ఎస్ కు సూచించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *