Breaking News

సీఎం చంద్ర‌బాబు కార్య‌ద‌క్ష‌త వ‌ల్లే వ‌ర‌ద బాధితులు విపత్తు నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు : ఎంపి కేశినేని శివ‌నాథ్

-సత్యసాయి సేవా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను పంపిణీ
-ఎమ్మెల్యే బొండా తో క‌లిసి స‌రుక‌ల ట్రాక్ట‌ర్స్ కి జెండా ఊపిన ఎంపి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడ్ని ప్ర‌జ‌లు దేవుడిలా కొలుస్తున్నార‌ని విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ అన్నారు. సెంట్రల్ నియోజకవర్గం సీతారాంపురం కాలనీ నందు శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో వరద ముంపు బాధితులకు ఏర్పాటు చేసినటువంటి నిత్యవసర సరుకుల పంపిణీ ట్రాక్టర్లను ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావు , శ్రీ సత్యసాయి ట్రస్ట్ ఎండి ఆర్ జె రత్నాకర్ తో కలిసి ఎంపి కేశినేని శివ‌నాథ్ జెండా ఊపి ప్రారంభించారు. సత్యసాయి సేవా సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వ‌ర్యంలో ఏడు వేల మందికి బియ్యం, కందిపప్పు, పంచదార ఇతర వస్తువులను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేశామన్నారు. అనేక స్వచ్ఛంద సంస్థలు బాధితులకు అండగా నిలిచాయన్నారు. సత్య సాయి సేవ సంస్థలు నిత్యవసర సరుకులు పంపిణీ చేయటం సంతోషంగా ఉందన్నారు. ప్రభుత్వం తరఫున వారికి ధన్యవాదాలు తెలిపారు. మొదటి రోజు నుంచే ఫుడ్ పంపిణీని ప్రారంభిస్తున్నట్టు కేశినేని చిన్ని వెల్లడించారు.

శ్రీ స‌త్య‌సాయి సేవ సంస్థ చేస్తున్న సేవలు గుర్తుంచుకుంటామని తెలిపారు. సీఎం చంద్రబాబు కార్యదక్షత వల్లే నేడు ముంపు బాధితులు ఈ విపత్తు నుంచి గట్టెక్కారని కేశినేని శివ‌నాథ్ అన్నారు.

అనంత‌రం ఎమ్మెల్యే బొండా ఉమ మాట్లాడుతూ.. సత్యసాయి ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అని నిరూపించారన్నారు. రెండున్నర కోట్ల విలువ చేసే సరుకులు పంపిణీ చేశారన్నారు. వారి సభ్యులు స్వయంగా బాధితులను కలిసి అందిస్తున్నారన్నారు. దాతలు మరింత మంది ముందుకు రావాలన్నారు. మొదటి రోజు నుంచే బాధితులకు అండగా నిలిచామన్నారు.

ఆ త‌ర్వాత సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు రత్నాకర్ మాట్లాడుతూ.. విజయవాడలో వరద బాధితులకు తమ వంతు సహాయం అందించామన్నారు. 600 మంది సభ్యులు పాల్గొన్నారన్నారు. ప్రభుత్వం పరంగా కూడా అపారమైన సాయం అందించారన్నారు. దేశంలో ఎక్కడ విపత్తు వచ్చిన అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. . ఏడు వేల మందికి నిత్యవసర సరుకులు ఇస్తున్నామన్నారు. 19 రకాల వస్తువులతో కిట్స్ అందిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో నేష‌న‌ల్ సేవాద‌ళ్ కో-ఆర్డినేట‌ర్ ఎస్.కోటేశ్వ‌ర‌రావు, గ్లోబ‌ల్ కౌన్సిల్ మెంబ‌ర్ ఎస్.జి.చ‌లం, శ్రీ స‌త్య సాయి సేవ సంస్థ రాష్ట్ర అధ్య‌క్షుడు ల‌క్ష్మణ్ రావు, వైస్ ప్రెసిడెంట్ సి.హెచ్. సురేంద్ర‌, స్టేట్ సేవాద‌ళ్ కో-ఆర్డినేట‌ర్ కె.శ్యామ్ ప్ర‌సాద్ తదితరుల పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *