Breaking News

జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకు   బ్యాంకులు లింకేజ్ గా   4899 గ్రూపులకు 439.50 కోట్లు మంజూరు చేసాం.

-మహిళలు పారిశ్రామికవేత్తలుగా  యూనిట్లు ఏర్పాటు దిశగా రుణాల మంజూరుకు చర్యలు
-జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో స్వయం సహాయక సంఘాలోని 4899 గ్రూపులకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు  439.50 కోట్లు బ్యాంకు లింకేజ్ మంజూరు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి పేర్కొన్నారు. బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ వారి సమావేశ మందిరంలో డి ఆర్ డి ఏ, మత్స్యశాఖ, ఉద్యానవన,.పారిశ్రామిక శాఖలఅధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు బ్యాంకులు లింకేజి ద్వారా 4,899 స్వయం సహాయక సంఘాలకు రూ.439.50 కోట్లు మంజూరు చేయడం జరిగిందన్నారు. స్త్రీ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 13,695 స్వయం సహా యక సంఘాలకు రూ.77.18 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. మహిళా మార్ట్ లు, లక్ష్యం మేరకు అమ్మకాలు పెంచే విధం గా చర్యలు తీసుకోవాలన్నారు. సామాజిక పెట్టుబడి నిధులు నూరు శాతం వసూలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. మహిళలు పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చెందే దిశగా వారికి ఆర్థిక పరిపుష్టిని చేకూర్చాలన్నారు. మహిళలకు నూతనంగా జీవనోపాదిని కల్పించే దిశగా నూతనంగా యూనిట్లు ఏర్పాటు వారికి లోన్లు మంజూరు అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. మత్స్యశాఖ, ఉద్యానవన శాఖ, పారిశ్రామిక శాఖల సమన్వయంతో స్వయం సహాయక సంఘాల్లోని మహిళలకు ఆర్థిక పరిపుష్టిని ఏర్పాటు చేసే దిశగా యూనిట్లు స్థాపన ఏర్పాటుపై దిశ నిర్దేశం చేశారు. మహిళలకు జీవనోపాధి కలిగించి ఆర్థికంగా అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ ఎన్ వి వి ఎస్. మూర్తి, డిపిఎంలు ఏ.గణేష్, వై.జనార్దన్ రావు, ఎస్. సంపత్ కుమార్, ఏపీఎంలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *