Breaking News

నేడే జాతీయ లోక్ అదాలత్

-ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలో 14.9.2024 జాతీయ లోక్ అదాలత్
-రెండవ శనివారం ఉదయం 10 గంటల నుంచి
-జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత

రాజమహేంద్రవరం /కాకినాడ /అమలాపురం /రంపచోడవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని కోర్టుల యందు ది. 14.09.2024 న (రెండవ శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుననీ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

జాతీయ లోక్ అదాలత్ నిర్వహించే కోర్టులు :
1. రాజమహేంద్రవరం 2. అమలాపురం 3. కాకినాడ 4. పెద్దాపురం 5. పిఠాపురం 6. రామచంద్రపురం 7. రాజోలు 8. ఆలమూరు 9. తుని 10. ముమ్మిడివరం 11. కొత్తపేట 12. ప్రత్తిపాడు 13. అనపర్తి 14. రంపచోడవరం 15. అడ్డతీగల.

ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడునని పేర్కొన్నారు.

కావున కక్షిదారులందరు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు ది. 14.09.2024 న (శనివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా ఆ ప్రకటన లో తెలియ జేయడమైనది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *