Breaking News

మేయ‌ర్ విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ‌ను అప్ర‌తిష్ఠ పాలు చేసింది : మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్

-మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్, కొట్టేటి హ‌నుమంతురావు మీడియా స‌మావేశం
-బాధితుల్ని ప‌ట్టించుకోని మేయ‌ర్ రాజీనామా చేయాలని డిమాండ్
-ఇందిరా గాంధీ వ‌ల్లే కాలేదు జ‌గన్ బ‌చ్చా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేయ‌ర్ అంటే పార్టీల‌కు అతీతంగా పనిచేయాలి…కానీ విజ‌య‌వాడ న‌గ‌ర మేయ‌ర్ మాత్రం ఒక పార్టీకే కొమ్ముకాస్తున్నారు. న‌గ‌ర‌వాసులు వ‌ర‌ద ముంపుకి గురైతే బాధితుల్ని ఆదుకునేందుకు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు విజ‌య‌వాడకి త‌ర‌లివ‌స్తే…న‌గ‌ర మేయ‌ర్ రాయ‌న భాగ్య‌ల‌క్ష్మీ ఏమి ప‌ట్ట‌నట్టు వున్నారు. న‌గ‌ర పాల‌క సంస్థ ద‌గ్గ‌ర ఆదాయం వున్నా బాధితుల‌కి ఎలాంటి స‌హాయ‌క కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌కుండా న‌గ‌ర పాల‌క సంస్థ‌ను అప్ర‌తిష్ట పాలు చేశార‌ని మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ అన్నారు.

వ‌ర‌ద‌ల కార‌ణంగా న‌గ‌ర మేయ‌ర్ వైఖ‌రి, తీరును నిరసిస్తూ గురునాన‌క్ కాల‌నీలో విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో శ‌నివారం టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్య‌ద‌ర్శి, మాజీ ప్లోర్ లీడ‌ర్ కొట్టేటి హ‌నుమంతురావు తో క‌లిసి మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా మాజీ మేయ‌ర్ కోనేరు శ్రీధ‌ర్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు,మంత్రులు క‌లెక్ట‌ర్లు, అధికారులు, ఎమ్మెల్యేలు వ‌ర‌దల్లో తిరిగితే న‌గ‌ర మేయ‌ర్ ఇంట్లో కూర్చొని వుండ‌టానికి సిగ్గుండాలన్నారు. వ‌ర‌దల కార‌ణంగా ఇబ్బందుల్లో వున్న ప్ర‌జ‌ల‌ను ఆదుకునేందుకు మేయ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఇంత‌వ‌ర‌కు ఎందుకు జ‌ర‌గ‌క‌లేదో స‌మాధానం చెప్పాల‌న్నారు. న‌గ‌ర కార్పొరేష‌న్ సంస్థ ద‌గ్గ‌ర ఆదాయం వున్నా బాధితుల‌కి సాయం చేయ‌టానికి వెన‌క‌డుగు వేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. వ‌ర‌ద బాధితుల్ని రాష్ట్ర ప్ర‌భుత్వం తోపాటు దాత‌లు మాత్ర‌మే ఆదుకున్నారని న‌గ‌ర పాల‌క సంస్థ ఒక్క రూపాయి కూడా ఖ‌ర్చు పెట్ట‌లేదన్నారు. గ‌త మూడేళ్ల‌లో ప‌దిహేను ప‌ర్సెంట్ చొప్పున రెండు సార్లు ఇంటి ప‌న్ను పెంచి ఆదాయం పెంచుకున్న న‌గ‌ర పాల‌క సంస్థ బాధితుల‌కి సాయం చేయ‌లేని పేద‌రికంతో వుందా అంటూ ప్ర‌శ్నించారు. ఆదాయం వుండి న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని న‌గ‌ర పాల‌క సంస్థ రాష్ట్రంలో విజ‌య‌వాడ న‌గ‌ర పాల‌క సంస్థ మాత్ర‌మే అంటూ విమ‌ర్శించారు. రాష్ట్రం లో ఎంతో మంది బాధితుల్ని ఆదుకునేందుకు సాయం చేస్తుంటే…ట్యాక్స్ ల రూపంలో ప్ర‌జ‌ల డ‌బ్బులు దండుకుంటున్న న‌గ‌ర పాల‌క సంస్థ బాధితుల కోసం ఒక పైసా ఖ‌ర్చు పెట్ట‌లేదంటూ మండిప‌డ్డారు. .

వైసిపి ఎమ్మెల్యే జ‌గ‌న్ వ‌ర‌ద వ‌చ్చిన ప‌దిరోజుల‌కైనా వ‌చ్చాడు…న‌గ‌ర మేయ‌ర్ మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు బాధితుల్ని ప‌ల‌క‌రించ‌లేదన్నారు. న‌గ‌ర ప్ర‌జ‌ల‌ను ప‌ట్టించుకోని మేయ‌ర్ ఆ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేశారు.

అరాచ‌క పాల‌న‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ జ‌గ‌న్
టిడిపిను భూస్థాపితం చేయ‌టం మాజీ ప్ర‌ధాని మంత్రి ఇందిరాగాంధీ వ‌ల్లే కాదు..వైసిపి ఎమ్మెల్యే జ‌గ‌న్ ఎంత ఆ బ‌చ్చా వ‌ల్లే ఏమి అవుతుంది. రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడును జ‌గ‌న్ విమ‌ర్శించ‌టం మానుకోవాల‌ని టిడిపి విజ‌య‌వాడ పార్ల‌మెంట్ కార్య‌ద‌ర్శి, మాజీ ప్లోర్ లీడ‌ర్ కొట్టేటి హ‌నుమంతురావు హెచ్చ‌రించారు.

వ‌ర‌ద బాధితుల‌కి ఒక్క వాట‌ర్ బాటిల్ కూడా సాయం చేయ‌లేని జ‌గ‌న్ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే హక్కులేద‌న్నారు. వ‌ర‌దవ‌ల్ల ప్ర‌జలు ఇబ్బందులు ప‌డుతుంటే వారిని ఆదుకోవటం తెలియ‌ని జ‌గ‌న్ కి సీఎం చంద్ర‌బాబును ప్ర‌శ్నించే అర్హ‌త లేద‌న్నారు. జ‌గ‌న్ ప్ర‌జ‌ల్లో క‌నిపించాల‌నే త‌ప‌న‌తో బుర‌ద రాజ‌కీయాలు చేయ‌టానికి ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడితే ఊరుకోమ‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు వ‌ర‌ద బాధితుల‌కి మ‌నో ధైర్యం క‌ల్పించేందుకు రాత్రింబ‌వ‌ళ్లు నిద్రాహారాలు లేకుండా క‌ష్ట‌ప‌డి న‌గ‌రంతో పాటు ప్ర‌జ‌ల‌ను సాధార‌ణ స్థితికి తీసుకువ‌చ్చార‌న్నారు. జ‌గ‌న్ అరాచ‌క పాల‌న‌కి బ్రాండ్ అంబాసిడ‌ర్ అని గ్ర‌హించిన ప్ర‌జ‌లు గ‌త ఎన్నిక‌ల్లో 11 సీట్లు ఇచ్చి మూల‌న కూర్చొబెట్టిన ఇంకా బుద్ది రాలేద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో అర్బ‌న్ మైనార్టీ సెల్ మాజీ అధ్య‌క్షుడు ఎమ్.డి.ఇర్ఫాన్ పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *