Breaking News

విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించేందుకు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాఠశాల విద్య సమగ్రశిక్ష విభాగంలో ఆర్ట్,వర్క్, వ్యాయామ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న వృత్తి విద్యా ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ (ఎం.టి.ఎస్) అమలు చేయాలని ఎపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఎపి వర్క్, వ్యాయామ ఉపాద్యాయుల యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్ష ప్రధాన కార్యదర్శులు సైకం శివకుమారి రెడ్డి, శంకర్ నీలు భాగవతుల డిమాండ్ చేశారు.

శనివారం విజయవాడ లోని రెవిన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం భవనంలో జరిగిన యూనిటీ అసోసియేషన్ ఎక్జిక్యూటివ్ కమిటీ రాష్ట్ర స్థాయి సదస్సులో వారు మాట్లాడుతూ పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఉన్నతాధికారుల సిఫారసుల మేరకు జి.ఒ నెంబరు 73 ప్రకారం సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న ఇ.ఎస్.ఐ, ఇ.పి.ఎఫ్ లను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్న డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా పాఠశాలలో ఆర్ట్స్ మరియు వర్క్ లో విద్యార్థులలో నైపుణ్యం పెంపొందించేందుకు వృత్తి విద్యను ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాల పని వేళల్లో పనిచేస్తున్నా పార్టటైం పేరుతో నష్టపోవడం జరుగుతోందని వృత్తి విద్యా ఉపాద్యాయులుగా డిజిగ్నేషన్ మార్చి, ఎస్.సి.ఇ.ఆర్.టి ద్వారా వృత్తి విద్యకు ప్రత్యేక సిలబస్ ను రూపొందించి తరగతిలో అమలు చేయాలని కోరారు. తద్వారా విద్యార్థులలో కళా నైపుణ్యం పెరుగుతుందని అన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగ సంఘాలతో గత ప్రభుత్వ కాలంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో జరిపిన చర్చలు మినిట్స్ లోని అంశాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సమగ్ర పరిశీలన చేసి తగు చర్యలు చేపట్టాలని యూనిటీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు శివకుమారి రెడ్డి, శంకరరావు ప్రభుత్వాన్ని కోరారు.

సంఘం బలోపేతానికి కృషి చేయాలి
యూనిటీ అసోషియేషన్ మండల,డివిజన్,స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి అసోషియేషన్ బలోపేతానికి రాష్ట్ర, జిల్లా నాయకత్వాలు కృషి చేయాలని ఎపి జెఎసి అమరావతి చైర్మన్ వెంకటేశ్వర్లు సూచించారు. సమగ్ర శిక్ష పరిధిలో వివిధ ఉద్యోగ హోదాలలో విధులు నిర్వహిస్తున్న సంఘాలను ఏకం చేసుకొని సమస్యల సాధనకు కృషిచేయాలన్నారు. ఐక్యతతోనే సంఘం అభివృద్ధి చెందుతుందని ఎపిజెఎసి 93 రోజుల ఉద్యమంలో జి.ఒ. నెంబరు.73 సాధించుకోవడంలో పార్టుటైం ఇన్స్రక్టర్ల ఉద్యమ ఫలితమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగరాజారావు,రాష్ట్ర కన్వీనర్లు యం.వి.రమణ,జి.కామేశ్వరరావు, క్రమశిక్షణ కమిటి ఆర్గనైజర్ శ్యాం సుందర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల అద్యక్షకార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *