Breaking News

అధికారులు, విద్యార్ధులతో స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలు తమ నివాసాలతోపాటు పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచడం ఒక అలవాటుగా పాటించాలని అప్పుడే స్వచ్చ గుంటూరు, స్వచ్చ ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ ఐఏఎస్  అన్నారు. స్వచ్చత హి సేవా లో భాగంగా మంగళవారం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం, నగరాలులోని నవీన స్కూల్ వద్ద, లక్ష్మీపురంలోని ఎన్టీఆర్ స్టేడియంలో ఎంఎల్ఏలు మహ్మద్ నసీర్, బి.రామాంజనేయులు, జి.మాధవి, డిప్యూటీ మేయర్ షేక్.సజిలా, కార్పొరేటర్లు, అధికారులు, విద్యార్ధులతో స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ చేపట్టారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు తమ చుట్టు పక్కల పరిసరాల పరిశుభ్రతను కూడా తమ జీవన విధానంలో అలవాటుగా చేసుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అక్టోబర్ 2 వరకు జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్చత హి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. పారిశుధ్య నిర్వహణకు ప్రజారోగ్య కార్మికులు ఉన్నప్పటికీ ప్రజల భాగస్వామ్యం ఉంటేనే మెరుగైన పారిశుధ్యం సాధ్యమవుతుందన్నారు. ఇందులో భాగంగా పారిశుధ్యంతో పాటు, ప్రజారోగ్య కార్మికుల, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి మెడికల్ క్యాంప్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు కూడా తమ నివాసాలు, వ్యాపార సంస్థల వ్యర్ధాలను రోడ్లమీద, కాల్వల్లో వేయకుండా ప్రజారోగ్య కార్మికులకే అందించాలన్నారు. హాస్పటల్స్ కూడా బయో వ్యర్ధాలను వేరుగా ఆయా ప్రతినిధులకే అందించాలన్నారు. స్వచ్చ నగరాలు, గ్రామాల లక్ష్యంతో జరుగుతున్న స్వచ్చత హి సేవాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
కమిషనర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ స్పూర్తితో ప్రతి ఏడాది ఆయన జయంతి సందర్భంగా స్వచ్చతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. జిఎంసి పరిధిలో 15 రోజుల పాటు స్వచ్చత హి సేవా లో భాగంగా ప్రజా ప్రతినిధులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, యువత, పెన్షనర్స్ ల భాగ స్వామ్యంతో మెరుగైన స్వచ్చ గుంటూరు సాధనకు కృషి చేస్తున్నామన్నారు.
ఎంఎల్ఏ రామాంజనేయులు  మాట్లాడుతూ స్వచ్చత అంటే మన కుటుంబాన్ని, తోటివారిని అనారోగ్య సమస్యల నుండి కాపాడుకోవడమేనన్నారు. ఇప్పటికే సాదారణ జీవితంలో 30 శాతం ఆదాయం వైద్య ఖర్చుల కోసమే పెడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్చత హి సేవా ప్రతిజ్ఞ చేసిన విధంగా స్వచ్చ పరిసరాలు, స్వచ్చ నగరం కోసం కృషి చేయాలన్నారు.
ఎంఎల్ఏ మహ్మద్ నసీర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్చ గుంటూరు నినాదంతో 15 రోజులపాటు స్వచ్చతపై అధికారులు, ప్రజలు, ప్రజా ప్రతినిధులు సంయుక్తంగా కృషి చేయాలన్నారు. ప్రజారోగ్య కార్మికులు సుందర నగరం కోసం కష్ట పడుతున్నారని, వారికి మరింత భారం కాకుండా ప్రజలు కూడా తగిన సహకారం అందిస్తూ వ్యర్ధాల నిర్వహణ చేపట్టాలన్నారు.
ఎంఎల్ఏ మాధవి మాట్లాడుతూ గుంటూరు నగరంలో గత 3 నెలల నుండి పారిశుధ్య పనులను ప్రత్యక్ష్యంగా గమనిస్తున్నామని, ప్రభుత్వ యంత్రాంగానికి ప్రజలు కూడా సామాజిక భాద్యతగా సహకరించాలన్నారు. స్వచ్చను మన ఇళ్లల్లో ఎలా అమలు చేస్తామో, చుట్టూ ఉన్న పరిసరాలను కూడా చేయాలన్నారు.
కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఎస్.ఈ. శ్యాం సుందర్, సిటి ప్లానర్ రాంబాబు, డిప్యూటీ కమిషనర్లు సిహెచ్.శ్రీనివాస్, టి.వెంకట కృష్ణయ్య, ఎంహెచ్ఓలు మధుసూదన్, రామారావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *