Breaking News

ఒరిస్సాలో 2.0 ప్రధానమంత్రి అవాస్ యోజన కార్యక్రమం లో పాల్గొన్న పిఎం

-వర్చువల్ కార్యక్రమం ద్వారా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని దేశ ప్రధానమంత్రి ఒడిస్సా రాష్ట్రం భువనేశ్వర్ నుంచి పాల్గొనడం జరిగింది. జిల్లా స్థాయి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ పి ప్రశాంతి, మునిసిపల్ కమిషనర్ కేతన గార్గ్, ఇన్చార్జి హౌసింగ్ పిడి కె ఆర్ కృష్ణ నాయక్, ఎపి ఈపిఎస్పీ డిసీఏల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ కే. తిలక్ కుమార్, డి ఆర్ డి ఎ పీడీ ఎన్ వివిఎస్ మూర్తి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఈ డి. బాల శంకర రావు, హౌసింగ్ అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో ప్రధాన మంత్రి అవాస్ యోజన 1.0 కింద 71,424 ఇళ్లు మంజూరు కాగా 40,810 ఇళ్లు నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు వివిధ దశల్లో నిర్మాణ పనులు కోసం రూ.571.18 కోట్లు ఖర్చు చేశామన్నారు. 26202 ఇళ్ల నిర్మాణం పూర్తి కాగా, స్టేజ్ కన్వర్షన్ 40,810 ఇళ్లు ఉన్నాయన్నారు. పట్టణ ప్రాంతాల్లో 25091 ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1,111 ఇళ్లు నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పేద వర్గాలకు ఇళ్ళ నిర్మాణం చేపట్టడం జరుగుతుందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *