Breaking News

ఉచిత ఇసుక పాలసీ విధానం లో దిశా నిర్దేశనం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉచిత ఇసుక పాలసీ విధానం లో వినియోగదారులు రాష్ట్ర స్థాయిలో నిర్ణయించిన రవాణా, ఇతర ఖర్చులను మాత్రమే చెల్లించే విధంగా , ఎటువంటి ప్రభుత్వ రుసుములు చెల్లించ వలసి అవసరం లేకుండా సెప్టెంబరు 19 నుంచి అందుబాటులోకి తీసుకుని రావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరం నుంచి జిల్లా డివిజన్ మండల స్థాయి అధికారులతో ఉచిత ఇసుక పాలసీ సరఫరా విధానం, వర్చువల్ శిక్షణా, ప్రి హోల్డ్ భూముల పై రెవెన్యు అధికారులకి జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు తో కలిసి దిశా నిర్దేశనం చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక సరఫరా చేసే విధానాల్లో వినియోగదారులు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించవల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. రవాణా జీఎస్టీ తో కలిపి , త్రవ్వకం , లేబర్ చార్జీలను మాత్రమే వినియోగదారులు చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇసుక రవాణ విషయంలో వాహనము క్యాటగిరి, మెట్రిక్ టన్నులు, దూరం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఏకి కృత ధరలను నిర్ణయించడం జరిగిందన్నారు. ఆ మేరకు వారు రవాణా, త్రవ్వకము వాటికీ సంబంధించి ఆన్లైన్ ద్వారా చెల్లించి, ఇసుకను పొందవచ్చు అన్నారు. జిల్లాలో మెట్రిక్ టన్నుకు రూ.362 లు గా నిర్ణయించినట్లు, వీటికి అదనంగా రవాణా , త్రవ్వకం అనుబంధ ఖర్చులు చెల్లించాలన్నారు. పూర్తి స్థాయిలో ఆన్లైన్ ద్వారా మాత్రమే లావాదేవీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయం వద్ద స్లాట్లను అనుసరించి ఇసుకను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇసుక ర్యాంప్ నుండి వినియోగదారుని ఇంటి వరకు ఉన్న దూరాన్ని లెక్కించి, మెట్రిక్ టన్నులకు అయ్యే ఖర్చులతో పాటు కిలోమీటర్ల దూరం అనుసరించి, వాహనం కేటగిరి అనుసరించి నిర్ణయించిన ధరను మాత్రమే చెల్లింపులు జరపాలన్నారు. పూర్తి పారదర్శకంగా జవాబు దారితనంతో ఉండే విధంగా ఇసుక రవాణ కు చెందిన వాహనాన్ని జియో ట్యాగింగు చెయ్యడం తప్పనిసరి చేశామన్నారు. వాహనాలను కూడా ఆటో ట్యాగింగ్ చేయనున్నట్లు తెలిపారు. ఆటోమేటిక్ గా ఇసుక ర్యాంపు వద్ద ఉన్న వాహనం ట్యాగ్ అవుతుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలు మరియు వాణిజ్యం (మైన్స్.III) శాఖ ద్వారా జీవో ఎంఎస్ నెంబర్ 52, తేదీ:14.9.2024 మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలిపారు.

ఉచిత ఇసుక పాలసీ విధానంలో మరింత ఖచ్చితంగా అమలు చేసేందుకు ప్రత్యేక పర్యవేక్షణ కోసం అధికారులను నియమించామన్నారు. అందుకోసం పి వో ఎస్ మిషన్ లు సిద్ధం చేసినట్లు, ప్రతి ర్యాంపు వద్ద సీ సీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిటైల్ వినియోగదారులు ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే అవకాశం ఉందని, బల్క్ బుకింగ్ విధానం లో జాయింట్ కలెక్టర్ అనుమతులు తప్పనిసరి అని తెలిపారు. జిల్లా స్థాయి లో ఇసుక రవాణా వాహనాలకు ఎంఫనల్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్న రాముడు, ఇసుక బుకింగ్ విధానం, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, ఆన్లైన్ లో చెల్లింపులు తదితర అంశాలపై పవర్ పాయింట్ ద్వారా వివరించడం జరిగింది. ఇసుక రవాణా చేసే విధానం సరుకు రవాణా సమయంలో నిర్ణయించి ధరలు వసూలు చెయ్యటం తో పాటుగా, ఖచ్చితంగా సమయపాలన పాటించడం అవసరం అన్నారు. జాప్యం జరిగిన సందర్బంలో అపరాధ రుసుము వసూలు చేస్తామని తెలియ చేశారు.

రీ వెరిఫికేషన్ ఆఫ్ ఫ్రీ ఓల్డ్ లాండ్స్, 22a భూముల ధ్రువపత్రాలు జారీ, పెండింగ్ దరఖాస్తుల పురోగతి, తదితర అంశాలపై కలెక్టర్ ప్రశాంతి రెవెన్యూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు .. సీసీఎల్ఏ నిర్దేశించిన మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని , అర్హత లేని దరఖాస్తుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. మండల స్థాయిలోని ప్రతి ఒక్క దరఖాస్తులు కచ్చితంగా సహేతుకమైన విధానంలో పరిష్కారం చూపాలన్నారు తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకోవడం జరుగుతున్నారు. జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో చేపడతామని అప్పుడు ఎటువంటి లోపాలు గుర్తించిన అధికారిగా పూర్తి బాధ్యత అని కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో ఇన్చార్జ్ ఆర్డీఓ లు కేఎల్ శివ జ్యోతి , ఆర్ వి కృష్ణ నాయక్ , మైన్స్ ఏ డీ – ఎం సుబ్రహ్మణ్యం, జిల్లా రవాణా అధికారి కే వి వి కృష్ణారావు, ఆర్డి టూరిజం వి. స్వామీ నాయుడు, జిల్లా రిజిస్ట్రార్ కే. ఆనంద రావు, డి ఎమ్ సివిల్ సప్లై టీ రాధిక, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *