Breaking News

పిల్లల్లో నులిపురుగులు నివారణకు అల్బెండజోల్ మాత్రలను తప్పనిసరిగా తీసుకోవాలి

– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు 4,30,339 వున్నారని, వారందరికీ ఆల్బెండజోల్ మాత్ర వేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం చాగల్లు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన నేషనల్ డీవార్మింగ్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్బగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ నులిపురుగులతో పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుందని, నులిపురుగులు నివారణకు ఆల్బెండజోల్ మాత్రలను  తీసుకోవాలన్నారు. అంగన్వాడి స్కూల్ కాలేజ్ ల నందు వున్న పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 3400 ఇన్స్టిట్యూషన్స్ అంగన్వాడి , ప్రభుత్వ పాఠశాల , ప్రైవేటు పాఠశాల , ప్రభుత్వ కళాశాల , ప్రైవేటు కళాశాల , ఇంజనీరింగ్ కాలేజీలలో కేంద్రాలను ఏర్పాటు చేసి అందిస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తంగా 1 నుండి 19 సంవత్సరాల పిల్లలు 4,30,339 వున్నారని  వారందరికీ ఆల్బెండజోల్ మాత్ర వేయడం జరుగుతుందని కావున ప్రతి తల్లితండ్రులు వారి పిల్లలను తప్పనిసరిగా స్కూల్ మరియు కాలేజీలకు పంపించాలని స్కూల్ మరియు కాలేజీలలో చేరని వారికి వారి యొక్క అంగన్వాడి సెంటర్ ల నందు ఈ మాత్ర ఇవ్వడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు, డిప్యూటీ డి ఈ ఓ ఈ. నారాయణరావు, తహసీల్దార్ ఎం
మెరకమ్మ , ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *