Breaking News

వరదలు, భారీ వర్షాలు నష్టాల పై బ్యాంకర్లు తో ప్రత్యేక డి సి సి

-కలెక్టరు ప్రశాంతి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల కాలంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు బీమా చెల్లింపులు, తిరిగి రుణాలు మంజూరు విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి కోరారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్యాంకర్లు, సమన్వయ శాఖల అధికారులతో స్పెషల్ జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సమావేశంలో భాగంగా బ్యాంకర్లు తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జూలై నెలలో సంభవించిన ఎర్ర కాలువ వరదలు, సెప్టెంబరు నెలలో భారీ వర్షాలు నేపథ్యంలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో నష్టాలు వాటిల్లడం జరిగిందన్నారు. జిల్లాల్లో జూలై నెలలో ఎర్ర కాలువ,గోదావరీ వరదలు సంభవించడం వల్ల గోపాలపురం, నిడదవోలు నియోజక వర్గాల పరిధిలో 10 వేల ఎకరాలు ముంపుకు గురి అవ్వడం జరిగినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రైతులను తిరిగి పంట వేసేందుకు ప్రోత్సహించడం జరిగిందన్నారు. తిరిగి సెప్టెంబరు నెలలో సంభవించిన వరదలు కారణంగా ఎర్ర కాలువ దిగువ ప్రాంతానికి చెందిన 2,446 ఎకరాలు ముంపుకు గురి అయినట్లు తెలిపారు. ప్రకృతిపరంగా జిల్లాను విపత్తుగా ప్రకటించాలని సమావేశంలో ప్రతిపాదించడం జరిగిందన్నారు. క్రాప్ లోన్స్ మంజూరు, బీమా చెల్లింపుల విషయంలో బ్యాంకర్లు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టరు ప్రశాంతి సూచించారు. గత రెండు నెలల్లో జిల్లాలో వరదలు, భారీ వర్షాలు నేపథ్యంలో 279.72 కిమీ ఆర్ అండ్ బి రహదారులు, 203.53 కీ మీ పంచాయతీ రాజ్ రహదారులు దెబ్బతిన్నాయని, 94 ఎకరాల్లో హార్టికల్టర్ ముంపుకు గురి అయినట్లు తెలియ చేశారు.

ఈ సమావేశంలో యూనియన్ బ్యాంకు రీజినల్ అధికారి ఏ. విశ్వేశ్వరరావు, డీసీసీ కన్వీనర్ ఎల్ డి ఎం డివి ప్రసాద్, వ్యవసాయ అధికారి ఎస్. మాధవరావు, జిల్లా ఆర్ అండ్ బి అధికారి ఎస్ వి బి రెడ్డి, మత్స్యశాఖ అధికారికే. కృష్ణారావు, పంచాయతీరాజ్ డిఇ రామారెడ్డి, యూనియన్ జిల్లా ప్రాంతీయ అధికారి డి ఆర్ ఎం రావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *