Breaking News

బాధితులు ఎవరైనా, కమిషన్ లో ఫిర్యాదు చేస్తే తగు చర్యలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పంచాయతీ రాజ్ సంస్థలకు ఎన్నికైన గిరిజన ప్రజా ప్రతినిధులపై ఇతరవర్గాల దాడులను, ST కమిషన్ తీవ్రంగా పరిగణించి, సంబంధిత వ్యక్తులపై చర్యలకు పోలీస్ అధికారులకు సిఫారసు చేయటం జరుగుతుందని ST కమిషన్ ఛైర్మన్ డా. డి .వి. జి. శంకర రావు తెలిపారు. ఇటీవల పత్రిక లలో ప్రచురితమైన పార్వతీపురం మన్యం జిల్లా , సాలూరు మండలం , మరిపల్లి పంచాయితీ లోని మహిళా MPTC సభ్యురాలు జన్ని సీతారామ్ పై, జరిగిన దాడిని కమిషన్ సుమోటో గా స్వీకరించి, విచారణ జరుపవలసినదిగానూ, తగు చర్యలు తీసుకొనవలసినదిగా సంబంధిత అధికారులకు కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని ఛైర్మన్ ఒక ప్రకటన లో తెలిపారు. అదే విధంగా అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం లోని AP రెసిడెన్షియల్ బాలికల జూనియర్ కళాశాల లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్ధినులను ప్రిన్సిపాల్ మరియు ఫిజికల్ డైరెక్టర్, గుంజీలు తీయించటం కూడా సుమోటా గా స్వీకరించి , సంబంధిత అధికారుల నుండి నివేదిక కోరామని ఛైర్మన్ డా డి వి జి శంకర రావు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతికి, అభివృద్ధికి, రక్షణకు కమిషన్ సదా కట్టుబడి ఉంటుందని, బాధితులు ఎవరైనా, కమిషన్ లో ఫిర్యాదు చేస్తే తగు చర్యలు కమిషన్ తీసుకుంటుందని తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *