Breaking News

వరద బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైపరీత్యాల సమయంలో వైఎస్సార్ సీపీ పేదలు, బాధితులకు అండగా నిలుస్తుందని ఆ పార్టీ నేతలు అన్నారు. హనుమాన్ పేటలోని గోడౌన్ వద్ద మంగళవారం 50 వేల కుటుం బాలకు పంపిణీ చేసేందుకు సిద్దం చేసిన కిట్లను వాహ నాల్లో మూడు నియోజకవర్గాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు తరలించారు. వాహనాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఎండీ రుహుల్లా, మేయర్ భాగ్యలక్ష్మి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు, పశ్చిమ ఇన్చార్జీలు దేవినేని అవినాష్, షేక్ ఆసిఫ్, పార్టీ నేత పోతిన వెంకట మహేష్ తో కలిసి ప్రారంభిం చారు. వరద ప్రభావిత ప్రాంతాలకు కేటాయించిన వాహనాల్లోకి దేవినేని స్వయంగా కిట్లు లోడ్ చేయించి నియోజకవర్గాలకు పంపించారు. నేతలు మాట్లాడుతూ వరదల్లో చిక్కుకుని సర్వం కోల్పోయిన వారికి తమ వంతు బాధ్యతగా మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్టు తెలిపారు. వరద నుంచి తేరుకున్న తర్వాత అవసరాలను గుర్తించి 8 నిత్యావసర సరుకు లతో కూడిన కిట్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. గతంలో ఎప్పుడు విపత్తులు వచ్చినా తమ పార్టీ ముం దుండి పనిచేసిందని చెప్పారు. నియోజకవర్గాలకు పంపిన కిట్లను ఆయా డివిజన్ల వారీగా కేటాయించి పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ కార్పొరే టర్లు బాపతి కోటిరెడ్డి, ఎండీ ఇర్ఫాన్, వై.ఆంజనేయ రెడ్డి, యలకల చలపతి రావు, ఇసరపు రాజా, గుండె సుందర్పాల్, ఆలంపూర్ విజయ్, ఇతర పార్టీ నేతలు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *