Breaking News

బ్యాంకింగ్ సేవ‌ల‌కు ప్ర‌త్యేక ఫెసిలిటేషన్ సెంటర్

– విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో ఏర్పాటు
– ఈ నెల 20వ తేదీ నుంచి వ‌ర‌ద ప్ర‌భావిత ప్ర‌జ‌లు స‌ద్వినియోగం చేసుకోవాలి
– ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో నష్టపోయిన ప్ర‌జ‌ల‌కు బ్యాంకింగ్ సేవ‌లు అందించేందుకు ప్ర‌త్యేకంగా విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలో బ్యాకింగ్ ఫెసిలిటేష‌న్ కేంద్రం ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌ని.. ఈ నెల 20వ తేదీ శుక్ర‌వారం నుంచి ఈ కేంద్రం ద్వారా సేవ‌లు పొందొచ్చ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.సృజ‌న గురువారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. విజ‌య‌వాడ స‌బ్ క‌లెక్ట‌ర్ కార్యాల‌య ప్రాంగ‌ణం నుంచి ఫెసిలిటేష‌న్ కేంద్రం సేవ‌లందిస్తుంద‌ని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవ‌లు పొందేందుకు, అక్క‌డిక‌క్క‌డే ద‌ర‌ఖాస్తుల ప‌రిష్కారంతో పాటు స‌మ‌ర్థ‌వంత‌మైన ఫాలో-అప్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన‌ట్లు వివ‌రించారు. వివిధ బ్యాంకుల ప్ర‌తినిధులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటార‌ని.. రుణాల రీషెడ్యూల్‌, వినియోగ రుణాలు, మూల‌ధ‌న రుణాలు వంటి సేవ‌లు వీరిద్వారా పొందొచ్చ‌ని వివ‌రించారు. ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌తో పాటు సేవ‌లు పొందే ప్ర‌క్రియను సుల‌భ‌త‌రం చేసేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ భాగ‌స్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. ముంపు బాధితులు త‌మ ప‌రిధిలోని బ్యాంకులు లేదా ప్ర‌త్యేక ఫెసిలిటేష‌న్ కేంద్రం ద్వారా సేవ‌లు పొందొచ్చ‌ని క‌లెక్ట‌ర్ సృజ‌న తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *