Breaking News

వంద రోజుల్లో అభివృద్ధి పథంలో నడిపిన ఘనత కూటమి ప్రభుత్వందే

-బాధ్యతాయుతంగా ప్రజలు మెచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం.
-కమీషన్ల కోసమే వైసీపీ నేతలు టీటీడీ లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారు
-రూ 1 కోటి 72 లక్షలతో అభివృద్ధి పనులకు భూమి పూజచేసినమంత్రి సవితమ్మ

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
వంద రోజుల కూటమి ప్రభుత్వం ఇటు రాష్ట్రాన్ని, పెనుకొండ నియోజకవర్గ అభివృద్ధి పధంలో నడిపించిన ఘనత కూటమి ప్రభుత్వం కే దక్కుతుందని, మంత్రి సవితమ్మ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలంలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా గుడిపల్లి గ్రామంలో 20 లక్షల రూపాయల నిధులతో సి సి రోడ్డు నిర్మాణంకు భూమి పూజ చేశారు .అనంతరం సోమందేపల్లి మండలం లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడ నిర్మాణం కు 32లక్షల నిధులతో భూమి పూజ చేసిన మంత్రి సవితమ్మ గారు .అనంతరం గుడ్డం నాగేపల్లి నుండి సబ్ స్టేషన్ వరకు బీటీ రోడ్డు నిర్మాణంకై 1 కోటి 20 లక్షల రూపాయలతో భూమి పూజ చేసిన మంత్రి సవితమ్మ. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ 100 రోజుల్లో పెనుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పధంలో నడుపుతున్నామని ఎన్నికల్లో ఇచ్చిన హమీల భాగంగా అభివృద్ధి పనులకు భూమి పూజ చేయడం జరిగిందన్నారు.

ఆర్థికంగా ఎన్నో సవాళ్లు, ఇబ్బందులు ఎదుర్కొంటూ ప్రజలందరికీ ప్రభుత్వ పథకాల లబ్దిని వేకూర్చడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని ప్రజలందరికీ న్యాయం చేస్తూ ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసుకునేందుకు వందరోజుల పండుగను ప్రజల మధ్య జరుపుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే మే నెలలో పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి మొదటి నెల ప్రతి ఇంటికి వెళ్లి 7వేల రూపాయల పెన్షన్ ను అందజేశామన్నారు. ఇది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని పేద ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. నిరుద్యోగ యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మెగా డీఎస్సీ ద్వారా 16,437 మందికి పోస్టుల భర్తీకి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. పేద ప్రజల కడుపు నింపడానికి అన్న క్యాoటీన్లను పునరుద్ధరించామన్నారు పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే రాళ్లపై గత ప్రభుత్వ నాయకుల ఫోటోలను తొలగించి ప్రజల ఆస్తుల భద్రతకు భరోసా కల్పిస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని మంత్రి సవితమ్మ వివరించారు.

కమీషన్ల కోసమే వైసీపీ నేతలు లడ్డూ నాణ్యతలో రాజీపడ్డారు
టీటీడీ లడ్డు లో జంతువుల కొవ్వు ఉపయోగించి, భక్తుల మనోభావాలు దెబ్బతీశారు పరమ పవిత్రమైన తిరుమలలో ఇంతటి ఘోర అపచారానికి పాల్పడిన నీచులపై కఠిన చర్యలు తీసుకుంటామని,ప్రజల మనోభావాలతో ఎవరూ చెలగాటం ఆడవద్దు. కూటమి ప్రభుత్వం వచ్చాక టీటీడీ లో ప్రక్షాళన చేస్తున్నామని,. ప్రజల మనోభావాలు గౌరవించకుండా ఆలయ పవిత్రత దెబ్బతీశారని మంత్రి సవితమ్మ తెలియ చేశారు. ఈ కార్యక్రమం తెలుగుదేశం, జనసేన, బిజెపి పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *