అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ అధ్యక్షులు మోటూరి శంకరరావు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం పోరంకిలోని ఎపి స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్ ఏర్పాటుపై ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీని అమలు చేయడం పట్ల లక్షా 10వేల మాజీ సైనిక కుటుంబాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాయన్నారు. మాజీ సైనికులకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో.. కూటమి నేతలు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తారంటూ అందులో ఎటువంటి సందేహం లేదన్నారు. గత ప్రభుత్వంలో మాజీ సైనికుల సమస్యలను అసలు పట్టించుకోలేదని, ఇప్పటి ప్రభుత్వం మాజీ సైనికులకు కుటుంబ పెద్దగా అండగా నిలబడి మా కొద్దిపాటి సమస్యలు పరిష్కరించి ఆదుకొని భరోసా కల్పించాలని నూట డెబ్భై ఐదు నియోజక వర్గాల మరియు ఇరవైఐదు పార్లమెంట్ జిల్లా మాజీసైనిక సంఘ అధ్యక్షుల తరుపున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసోసియేషన్ స్టేట్ కమిటీ మరియు స్టేట్ ప్రెసిడెంట్‌గా కోరుతున్నానన్నారు. మేమంతా సంఘటితంగా అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ దేశం కోసం దేశం, రాష్ట్రాభివృద్ధికి కోసం మేము సైతం… అని కృషి చేసి పాటుపడతామన్నారు. అప్పుడు సైనికుడుగా బోర్డర్‌లో దేశం కోసం పాటుపడ్డామని, ఇప్పుడుకూడా మాజీ సైనికుడుగా రాష్ట్రాభివృద్ధికోసం చేయూతనిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఎక్స్ సర్వీస్‌మెన్ వెల్ఫేర్ ఆసోసియేషన్ కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ ఎం.గోపాలకృష్ణ, కృష్ణాజిల్లా జనరల్ సెక్రటరీ డాక్టర్ ఖలీల్, సభ్యులు ప్రొఫెసర్ కె.ఆర్.శేషాద్రిరావు, సుబేదార్ మేజర్ ఎం.సి.కె.రావు, ఎ.రామారావు, ఎం.గోపాలకృష్ణ, వై. రమేష్‌కుమార్, అన్నే రామారావు, పి.లక్ష్మీనారాయణ, వై.రమేష్‌కుమార్, జి.తిరుపతిరావు, డి.రమేష్, పి.రవీంద్రబాబు, డి.లక్ష్మీనారాయణ, జి.బాలాజీ, చంద్రశేఖర్, వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన మాజీ సైనిక ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
Tags amaravathi
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …