Breaking News

తెలుగుదేశం ప్రభుత్వమే వెలిగొండ ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తుంది

-అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 175 అన్న క్యాంటీన్లను ప్రారంభించాం
-సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నాం, ఇది ప్రజా ప్రభుత్వం
-తొలి క్యాబినెట్ లోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం, ఇది రైతన్నల ప్రభుత్వం
-ఓల్టేజ్ సమస్యకు చెక్ పెట్టేలా సబ్ స్టేషన్ల నిర్మాణాలు

కనిగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
వెలుగొండ ప్రాజెక్ట్ ను తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకు వస్తామని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఈ ప్రాంత సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాల్లో భాగంగా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డితో కలిసి కనిగిరి నియోజకవర్గంలో పర్యటించారు. స్థానిక చాకిరాల గ్రామ పంచాయతీలో 3 కోట్ల రూపాయలతో నిర్మించిన 33/11 కెవి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణాన్ని ప్రారంభించారు. అనంతరం సబ్ స్టేషన్ ఆవరణలో మంత్రి శ్రీ గొట్టిపాటి రవికుమార్, స్థానిక శాసన సభ్యులు డా. ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ… ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే అనేక మంచి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. తొలి క్యాబినెట్ లోనే చర్చించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేసి రైతుల భూమికి భద్రత, భరోసా కల్పించినట్లు మంత్రి తెలిపారు. అలాగే పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రంలో 175 అన్నా క్యాంటీన్ లను తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు.

కనిగిరి నియోజకవర్గ పరిధిలో వ్యవసాయ రంగంపై ముఖ్యంగా బోర్ల పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని, రైతాంగం ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హమీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో ఆర్డిఎస్ స్కీమ్ కింద రూ. 70 కోట్లతో చేపట్టిన విద్యుత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు. స్థానిక రైతాంగం కొత్త సబ్ స్టేషన్స్ కావాలని కోరారని తెలిపారు. ప్రాధాన్యతా క్రమంలో కొత్త సబ్ స్టేషన్స్ మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అలాగే కనిగిరి నియోజక వర్గ పరిధిలో పాడైన విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

ఇటీవల కనిగిరి నియోజక వర్గంలో విద్యుత్ లైన్ తెగి ముగ్గురు మరణించడం బాధాకరమని, ఈ విషయాన్ని వెంటనే శాసన సభ్యులు ఉగ్ర నరసింహా రెడ్డి నా దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి వారి కుటుంబాలకు ఎక్సగ్రెషియా త్వరగా అందేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అలాగే ఇలాంటి సంఘటనలకు సంబంధించి పెండింగ్ లో వున్న కేసులను క్లియర్ చేసి బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇటీవల విద్యుత్ లైన్ తెగి ముగ్గురు మరణించిన సందర్భంగా వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయల చెక్కును మంత్రి గొట్టిపాటి రవికుమార్ అందచేసారు. అనంతరం 6 మంది షిఫ్ట్ ఆపరేటర్లకు మంత్రి నియామక పత్రాలను అందచేసారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *