విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో ది.03.10.2024వ తేదీ నుండి 12.10.2024వ తేదీ వరకు ప్రతిష్టాత్మకంగా జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాల వేడుకలను పురష్కరించుకుని పోలీస్ వారి ఆడపడుచు అయిన అమ్మవారికి అనాదిగా వస్తున్న అనవాయితీ ప్రకారం సాంప్రదాయం నేపథ్యంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., సతీ సమేతంగా బుధవారం అమ్మవారికి చీరా, సారెను సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ముందుగా పోలీస్ కమీషనర్ దంపతులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణంలో రావి చెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిఅనంతరం మేళతాళాలతో అంగరంగ వైభవముగా ఊరేగింపుతో అమ్మవారికి చీర, సారెను తీసుకుని శ్రీ కనకదుర్గ గుడికి వెళ్ళగా, ఈ.ఓ. కె.ఎస్. రామారావు మరియు ఆలయ వైదిక కమిటీ వారు నగర పోలీస్ కమీషనర్ దంపతులను సాదరంగా ఆహ్వానం పలికి పరివేట్టం పలికి వేద పండితుల మంత్రొచ్చారణాల నడుమ నగర పోలీస్ కమిషనర్ సతీ సమేతంగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమీషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్., తో పాటు, డి.సి.పి.లు గౌతమి షాలి ఐ.పి.ఎస్, ఉదయరాణి ఐ.పి.ఎస్., ఉమా మహేశ్వర రాజు ఐ.పి.ఎస్., కృష్ణ మూర్తి నాయుడు, ఏ.డి.సి.పి.లు, ఏ.సి.పి.లు, ఇనస్పెక్టర్లు, ఎస్.ఐలు మరియు పోలీస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …